Friday, April 26, 2024
- Advertisement -

‘స్టాండప్ రాహుల్ ‘ రాజ్ తరుణ్ ను గట్టెక్కిస్తుందా..!

- Advertisement -

తన తొలి సినిమా ఉయ్యాల జంపాల సినిమా తోనే సూపర్ హిట్ అందుకున్నాడు రాజ్ తరుణ్. తొలి సినిమాతోనే యాక్టింగ్ లో అదరగొట్టాడు. ఇక రాజ్ తరుణ్ టాలీవుడ్ లో దూసుకెళ్లడం ఖాయమని అంతా భావించారు. అందుకు తగ్గట్లే ఉయ్యాల జంపాల తర్వాత సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్, సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. విష్ణుతో కలిసి నటించిన ఈడోరకం ఆడోరకం కూడా పర్వాలేదనిపించింది. ఆ తర్వాత రాజ్ తరుణ్ కు వరుసగా పరాజయాలు పలకరించాయి.

బాక్సాఫీస్ వద్ద రాజ్ తరుణ్ సినిమా హిట్ గా నిలిచి ఐదారేళ్లు దాటిపోయింది. రంగుల రాట్నం, రాజు గాడు, లవర్,ఇద్దరి లోకం ఒకటే, ఒరేయ్ బుజ్జి గా, పవర్ ప్లే వంటి సినిమాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. దీంతో రాజ్ తరుణ్ తాజాగా నటిస్తున్న స్టాండప్ రాహుల్ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.

ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మోహన్ వీరంకి దర్శకత్వం వహిస్తున్నాడు. నందకుమార్ అభినేని భరత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ మూవీలో రాజ్ తరుణ్ స్టాండప్ కమెడియన్ గా నటిస్తున్నాడు. తాజాగా స్టాండప్ రాహుల్ టీజర్ ను హీరో రానా విడుదల చేశారు. స్టాండప్ రాహుల్ అయినా రాజ్ తరుణ్ కు ఊరట ఇస్తుందేమో చూడాలి.

Also Read

ప్రకాష్ రాజ్​ కు గట్టిగా బదులిచ్చిన నరేశ్​..!

బిగ్ బాస్​ హోస్ట్​గా చేసేందుకు నో చెప్పిన రానా..!

రాజమౌళిపై రామ్​లక్ష్మణ్​లు సంచలన కామెంట్లు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -