మధురిమ. హీరోయిన్. అయితే ఆ పేరుతో నటిస్తే అచ్చి రావడం లేదని, ఒక్క సినిమా హిట్టు కొట్టడం లేదని ఇప్పుడు పేరు మార్చుకుంది. కొత్త పేరు ఏమిటో తెలుసా. అదే తన ముద్దు పేరు నిరా. మధురిమ తన అఫీషియల్ పేరు అయితే నిరా తన ముద్దు పేరట. ఇక మీదట వెడితెరపై అదే పేరుతో నటిస్తుందట.
ఫ్లాపులు ఒక్కటే సమస్య కాదని, తన పేరుతో తుళు భాషలో మరో నటి ఉందని, ఇద్దరి పేర్లు ఒక్కటే కావడంతో కన్ ఫ్యూజన్ గా ఉందని మధురిమ సారీ నిరా చెబుతోంది. తన పాత పేరు మధురిమతో తనకు ఎలాంటి సంబంధం లేదని అంటోంది. తెలుగులో సరైన విజయాలు దక్కని తాను బాలీవుడ్ లో తన కొత్త పేరుతో అదృష్టాన్ని పరీక్షించుకుంటుందట.
తెలుగులో మధురిమ సరదాగా కాసేపు, ఆరెంజ్, షాడో, వేట, కొత్త జంట, గ్రీన్ సిగ్నల్, టెంపర్, దోచయ్ తదితర సినిమాల్లో నటించింది. బాలీవుడ్ లో ఆమె నటించిన ఒన్ నైట్ స్టాండ్ సినిమా మే 6 న విడుదలైంది. పేరు మార్చుకుంది కదా… ఒకవేళ అప్పులేమైనా ఉంటే అవి తీరుస్తుందా.. ఎగ్గొడుతుందా అని ఇండస్ట్రీలో కొందరు గుసగుసలాడుకుంటున్నారు.