నందమూరి నటసింహం బాలకృష్ణ, యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శీను దర్శకత్వంలో “అఖండ” సినిమా తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే.ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్ పాత్రలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటించనున్నారు. తాజాగా ప్రగ్యా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నారు.
మొదటగా బాలకృష్ణ పక్కన హీరోయిన్ పాత్రలో చేయాలి అనగానే ఎంతో భయపడి పోయానని.. తరువాత సెట్లో బాలకృష్ణ గారిని చూసిన ఎంతో కూల్ గా, ధైర్యంగా షూటింగ్ లో పాల్గొన్నానని తెలిపారు. సాధారణంగా బాలకృష్ణ గారికి కోపం ఎక్కువ అని తెలియడంతో అతని పక్కన నటించాలంటే భయపడ్డాను. కానీ సెట్ లో అతను అందరితో ఎంతో సరదాగా అందరినీ నవ్విస్తూ ఉండటం చూసి ఎంతో ధైర్యంగా నటించానని తెలిపారు.
Also read:ఇంట్లో ఆకలి బాధలు అంటున్న హీరోయిన్.. ఎవరంటే?
ప్రస్తుతం బాలకృష్ణ గారి పై ఉన్న అపోహలు తొలగిపోయి,అతనితో నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ ఎప్పుడు ఉంటుందా అని ఎదురు చూస్తూ ఉంటాను అంటూ నటి ప్రగ్యా జైస్వాల్ తెలిపారు. ఇక ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేయనున్నారు. అఖండ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో హీరో శ్రీకాంత్ నటించినున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పాయి.
Also read:త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ సినిమా… త్వరలోనే ప్రకటన?