Friday, April 19, 2024
- Advertisement -

త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ సినిమా… త్వరలోనే ప్రకటన?

- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా మారిన తర్వాత యంగ్ హీరోలతో వరుస పెట్టి సినిమాలు తీస్తున్నారు.ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.అయితే రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ ఆడియో ఫంక్షన్ లో చిరంజీవి త్వరలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడని ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా ఊసే ఎత్తలేదు.

టి.సుబ్బిరామిరెడ్డి నిర్మాణంలో మెగాస్టార్ పవర్ స్టార్ కాంబినేషన్ లో చిత్రం రాబోతుందని అనౌన్స్ చేసినప్పటికీ ఈ సినిమా గురించి ఎలాంటి సమాచారం వినబడలేదు. ఇక తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ విక్టరీ వెంకటేష్ తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ నారప్ప, దృశ్యం సినిమాలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే నారప్ప విడుదల కావాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో వాయిదా పడింది.

Also read:అభిమానులకు నచ్చుతేనే ఆనందం అంటున్న తమన్నా!

ప్రస్తుతం వెంకటేష్ 73వ చిత్రం దృశ్యం2 కాగా, 74 సినిమా ఎఫ్ 3 ఇక 75వ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే విక్టరీ వెంకటేష్ మలయాళంలో హిట్టైన ‘డ్రైవింగ్ లైసెన్స్’  సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేసారు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్ చేస్తారా లేక హిందీలో హిట్టైన ‘జాలీ ఎల్‌ఎల్‌బీ 2’ రీమేకా అని తెలియాల్సి ఉంది.

Also read:బాలకృష్ణ తన కెరియర్లో వదులుకున్న సినిమాలివే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -