Tuesday, May 13, 2025
- Advertisement -

ఇది నాకు తెలియకుండా జరిగింది

- Advertisement -

హాలీవుడ్ లో ప్రముఖ నటి, ఆస్కార్ అవార్డ్ విజేత జెన్నీఫర్ లారెన్స్  ఓ సంచలన ప్రకటన చేసింది. అదేమిటంటే తాను ఇంతకు ముందు ఒకసారి డ్రగ్స్ తీసుకున్నానని వెల్లడించింది. అయితే అది తాను కావాలని చేసింది కాదని, తనకు తెలియకుండా అలా జరిగిపోయిందని ఆమె వివరించింది. హంగర్ గేమ్స్ చిత్రం షూటింగ్ సమయంలో ఈ సంఘటన జరిగిందని జిమ్మి ఫాలన్ గేమ్ షోలో లారెన్స్ తెలిపింది.

ఈ విషయంపై గేమ్ నిర్వాహకుడు జాన్ ఆలీవర్ అనేక ప్రశ్నలతో లారెన్స్ ను తికమక పెట్టాడు. డ్రగ్స్ తీసుకున్నాక నిద్రపోయారా అని అడిగితే కాదని, తాను డాన్స్ చేశానని లారెన్స్ బదులిచ్చింది. డ్రగ్స్ తీసుకున్న సమయంలో తాను భయపడ్డానని, అయితే నిద్ర లేచిన తర్వాత అంతా మామూలుగానే ఉందని ఆమె చెప్పింది.

ఇలాంటి సంఘటనల గురించి బహిరంగంగా వెల్లడించడం వల్ల నిర్మాణ సంస్ధలకు ఇబ్బందులు వస్తాయా అని అడిగితే కాదని, అయినా హంగర్ గేమ్స్ ని ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదని, ఇప్పుడు అందరి ముందు ఉన్నది స్టార్ వార్స్ సినిమాల గురించిన చర్చే అని జెన్నీఫర్ లారెన్స్ వివరించింది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -