Sunday, May 4, 2025
- Advertisement -

నేను సోనూ సూద్ లా మారిపోతానంటున్న అమ్మాయ్.. ఎవరంటే?

- Advertisement -

బాలీవుడ్‌ ప్రతినాయకుడు, రియల్ హీరో సోనూ కరోనా లాక్‌డౌన్ సమయంలో వేలాది మంది కార్మికులకు అండగా నిలిచి కలియుగ కర్ణునిగా అందరి చేత కీర్తించబడుతున్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో వలస కూలీలను, విదేశాల్లో చిక్కుకున్న పేద భారతీయులను, విద్యార్థులను వారి స్వస్థలాలకు చేర్చడంలో సోనూ సూద్ కృషి మరువలేనిది. కష్టాల్లో ఉన్నవారి కోసం ఆయన వేసిన ముందడుగు, తెగువ ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది.

తాజాగా ఓ చిన్నారి రియల్ హీరో సోను సూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకొని పెద్దయ్యాక ఏ డాక్టరో, ఇంజినీరో కాకుండా సోనూసూద్‌లా అవుతానని, దేశ ప్రజలకు అతనిలా సేవ చేస్తానని చెబుతోంది. ఆ వీడియోను చిన్నారి అమ్మ ప్రశాంతి ముప్ప తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసి సోనుసూద్ కు ట్యాగ్‌ చేసింది. అలాగే తన కూతురికి మిమ్మల్ని కలిసే అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్‌ చేసింది. ఆ పోస్టుకు సోనూసూద్‌ స్పందిస్తూ ఆమె ఒక స్టార్‌ అంటూ బదులిచ్చాడు.

Also read:ఆ ఫొటో చిరునవ్వులు తెప్పించింది: నమ్రత

అలాగే సోను సూద్ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఒకరిని కాపాడే ప్రయత్నంలో మీరు విఫలమయ్యారంటే మిమ్మల్ని మీరు పొగొట్టుకున్నట్లే. ఒకరి ప్రాణాల్ని నిలబెడతానని ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేనప్పుడు వాళ్ల కుటుంబాన్ని ఎదుర్కోవడం చాలా కష్టం. అలాంటప్పుడు నేను నిస్సహాయుడిగా బాధ కలుగుతుందని ఎమోషనల్‌ అవుతూ
తన ట్విట్టర్ ఖాతాలో మెసేజ్ చేశాడు.

Also read:న్యూడ్ క్లిప్స్ లీక్.. తలెత్తుకోలేని పరిస్థితి అంటూ రాధికా ఆప్టే ఎమోషనల్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -