Saturday, April 27, 2024
- Advertisement -

విజువల్ వండర్‌గా ఫతే!

- Advertisement -

సోనూ సూద్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఫతే. సైబర్ క్రైమ్ థ్రిల్లర్‌గా నేపథ్యంలో ఈ సినిమా వస్తుండగా శక్తి సాగర్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం సైబర్ క్రైమ్ యొక్క సంక్లిష్టతలు మరియు సవాళ్ల చుట్టూ తిరుగుతుంది.

తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. విజువల్ వండర్‌గా సినిమాను తెరకెక్కించారు దర్శకుడు సోనూ. ఒక కంప్లీట్ హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్స్ ఏ లెవెల్లో ఉంటాయో అలాగే టీజర్‌ని కట్ చేశారు. టీజర్ ఆధ్యంతం ఆసక్తికరంగా ఉంది. జాక్వలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఈ ఏడాదే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు సోనూ.

ఇప్పటికే రిలీజ్ అయిన ఫతే ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. కడియం తొడిగిన కుడిచేతిని గట్టిగా బిగించి వుండగా రక్తపు మరకలు వున్న పెన్నుతో ఉన్న పోస్టర్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ చిత్రానికి రచయిత, నిర్మాత కూడా సోనూ సూదే. యాక్షన్ సన్నివేశాలను అమెరికా,రష్యా ,పోలాండ్‌ దేశాల్లో చిత్రీకరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -