Sunday, May 12, 2024
- Advertisement -

షూటింగ్ సమయం లో చచ్చిపోతా అంటున్న పవన్ కళ్యాణ్ డైరెక్టర్

- Advertisement -

దర్శకుడు హరీష్ శంకర్ నెగెటివ్ తో పాటు పాజిటివ్ గా కూడా ఈయన మీద ఫిలిం నగర్ లో జనం మాట్లాడుకుంటూ ఉంటారు, ఆయన ఎనేర్జేటిక్ వ్యక్తి అని తన ఎనర్జీ అంతా సినిమా లలో చూపించి హీరోలని తన ఎనేర్జీ తో నింపేసే రకం అని చెబుతూ ఉంటారు.

ఒక్కొక్క సారి రామయ్య వస్తవయ్య లాంటి షాక్ లు తగులుతూ కూడా ఉంటాయి అవి మామూలే. కానీ అవి అతన్ని వేదాంతిని చేసాయి అన్నట్టు అనిపిస్తోంది.

 వేదాంతిని కాదు అని ఆయన చెబుతూనే వేదాంతి లాగా వేదాంతం మాట్లాడుతున్నాడు శంకర్. తన సినిమా లో ఎంటర్టైన్మెంట్ లేదు అనే విమర్శ ని తట్టుకోలేకే తన మార్క్ హాస్యం చూపించడం కోసం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తీశాను అని చెబుతున్నాడు హరీష్. ఈ సినిమాకి బి సి సెంటర్లలో వసూళ్లు అదిరిపోయాయని రిపోర్ట్ వచ్చింది. ఇదే సందర్భంలో హరీష్ చెప్పిన ఓ మాట గుర్తు తెచ్చుకోవాలి.

 ” డైరెక్టర్ గారు షాట్ చెబుతూ, క్లాప్ కొడుతూ, యాక్షన్- కట్ అంటూ చనిపోయారు ” అని తన గురించి చెప్పుకోవాలని అనుకుంటున్నా అంటాడు హరీష్. షూటింగ్ కోసం తాను పడి చస్తాను అని అంతగా సినిమా కి కమిట్మెంట్ అయ్యే మనిషి గా కనిపిస్తున్నాడు.

 9 సంవత్సరాల క్రితం అసిస్టంట్ డైరెక్టర్ గా రైటర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన ఇంతలో పెద్ద డైరెక్టర్ అవడం వెనక చాలా కథ ఉండే ఉంటుంది మరి. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -