- Advertisement -

లండన్లో భర్తకు వినూత్నంగా బుద్ది చెప్పిన తెలివైన ఇల్లాలు

- Advertisement -

లైఫ్ ను ఎంజాయ్ చేయడంలోనే కాదు…మెసేజ్ ను జనాలకు కనువిప్పు కల్గించడంలోను పాశ్చాత్యులది ప్రత్యేక మైన శైలి.

రీసెంట్ గా లండన్లో ఇలాంటి తంతే ఒకటి జరిగింది. పర స్త్రీ మోజులో  పడిన  భర్తకు అతని భార్య సరికొత్త రీతిలో బుద్ది చెప్పాలనుకుంది.దానిలో భాగంగా అత్యంత రద్దీగా ఉండే షెఫీల్డ్ పార్క్ వేలో 15 అడుగుల వెడల్పు 10 అడుగుల ఎత్తు కలిగిన డిజిల్ బిల్ బోర్డ్ ను ఎంపిక చేసుకుంది.అందుల్లో తన భర్త గురించి అందరికీ తెలిసేలా ఓ నీతి శతకాన్ని రాసింది.

అదేంటో తెలుసా…”నన్ను మోసం చేస్తోన్న పాల్ అనే ఓ నా భర్త….నువ్వు,నీ లవర్ తగిన వారు.నువ్వు ఇంటికి తిరిగొచ్చేసరికి నేనక్కడైతే ఉండను.నువ్వు మాత్రం ఆఫీస్ కు సుఖంగా డ్రైవ్ చేస్తూ వెళ్లు…. ఇట్లు లీసా ‘అంటూ తన భర్త పాల్ చెంప చెల్లుమనిపించేలా నోట్ రాసి…. ఎందరో వక్రబుద్ది చూపించే భర్తలకు కూడా అది వర్తించేలా చేసి మరీ… రచ్చ రంబోలా చేసింది. ప్రస్తుతం యుకెలో ఇదో పెద్ద సోషల్ హాట్ టాపిక్.

కొన్ని వేల మంది అటుగా వెళ్లే వారు ఈ డిజిటల్ బోర్డ్ ను  సోషల్ మీడియాలో ప్రమోట్    చేస్తూ…దీనికి మరింత విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు.ట్విట్టర్లో అయితే లీసాకు ఎందరో గుడ్ లక్ చెబుతున్నారు.

ఇపుడు మనం చూస్తోన్న ఈ సందేశం పాల్ ఆఫీస్ కు వెళ్లే సమయంలోనే కనిపించేలా లీసా డిజిటల్ బోర్డ్ నిర్వాహకులైన కాంగ్ మీడియాకు లక్షల కొద్దీ అమౌంట్ ను పే చేసిందట.వారు చెప్పడం ప్రకారం ఈ తరహా ఆలోచనలు కేవలం అమెరికాలో మాత్రమే కనిపిస్తాయి గాని లండన్ లో చూడటం ఇదే ఫస్ట్ టైమ్ అంటూ యాడ్ ఏజెన్సీ వారు చెబుతున్నారు. ఈ ఒక్క డిస్ ప్లే బోర్డ్ తో కాంగ్ మీడియాకు ఎంతో ప్రచారం లభించింది.ఎవరైనా లవ్ ప్రపోజల్స్ చేయాలనుకుంటే తమని వాడుకోవచ్చంటూ చెబుతున్నారు.

వాళ్లకు నచ్చిన రీతిలో డిజిటల్ బోర్డ్ లను హైవేలు,కూడలిలో  పెడతామంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -