Sunday, May 5, 2024
- Advertisement -

విల‌న్‌గా చేస్తానంటున్న మాస్ రాజా

- Advertisement -

మాస్ రాజా ర‌వితేజ భ‌విష్య‌త్తులో విల‌న్‌గా అయిన న‌టిస్తాడట‌. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ఓ ఇంట‌ర్య్వూలో చెప్పారు.ర‌వితేజ న‌టిస్తున్న అమ‌ర్ అక్బ‌ర్ అంటొని సినిమా విడుద‌ల‌కు రెడీ అవుతుంది. మూవీ ప్ర‌మోష‌న్‌లో భాగంగా ర‌వితేజ ఓ ఇంట‌ర్య్వూలో సినిమాకు సంబంధించిన విశేషాల‌ను చెప్పుకొచ్చారు.”ఈ సినిమాలో నేను పోషించిన అమర్ అక్బర్ ఆంటోని పాత్రలు మూడు కూడా వేటికవే వైవిధ్యభరితమైనవి. ఈ మూడు పాత్రల్లోను కొత్తగా కనిపిస్తాను.

ఈ మూడింటిలో నాకు ‘అమర్’ పాత్ర మరింతగా నచ్చింది. ఈ పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా నెగెటివ్ రోల్స్ కూడా ట్రై చేయవచ్చుగదా అనే ప్రశ్న ఎదురవుతోంది. నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను చేయడానికి నాకు ఇంకా సమయం ఉందని అనుకుంటున్నాను. భవిష్యత్తులో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను తప్పకుండా చేస్తాను. నెగెటివ్ షేడ్స్ కలిగిన ఆ పాత్రల్లోను కొత్తదనం ఉండేలా చూసుకుంటాను” అని చెప్పుకొచ్చాడు. ర‌వితేజ న‌టించిన అమ‌ర్ అక్బ‌ర్ అంటొనీ సినిమా ఈ నెల 17న విడుద‌ల కానుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -