Friday, March 29, 2024
- Advertisement -

పుట్టిన రోజున వైట్ల నుంచి ప్రకటన ఉంటుందా?

- Advertisement -

ఆనందంగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తన ఇష్ట దైవాన్ని వెంకీ అని, నమో వేంకటేశ అని పిలుచుకుంటూ అందరివాడిలా హిట్స్ తో బాక్స్ఆఫీస్ ని ఢీ కొట్టి దేనికైనా రెఢీ అంటూ తన దూకుడు తో రికార్డ్స్ ని సొంతం చేసుకున్న దర్శకుడు శ్రీను వైట్ల. ఈ దర్శకుడు ఈ రోజు తన పుట్టిన రోజుని జరుపుకుంటున్నాడు.

ఎప్పటి నుంచో ఇండస్ట్రీ లో కొనసాగుతూ కొన్ని పెద్ద హిట్స్ ని అందించిన ఈ దర్శకుడు ఇటీవల వరుస పరాజయాల పాలయ్యాడు. అయితే శ్రీను వైట్ల కి ఉన్న అభిమానులు మాత్రం ఏ మాత్రము తగ్గలేదు. ఎప్పటికప్పుడు కొత్త చిత్రాలని ఎంకరేజ్ చేస్తూ వస్తున్న అభిమానులు ఈ సీనియర్ దర్శకుడు తిరిగి ఫామ్ ని కొనసాగించాలనే ఉదేశ్యం తో ఉన్న మాట వాస్తవమే. ఇకపోతే ఈ దర్శకుడు తీసిన దూకుడు నిన్న నే 8 ఏళ్ళు పూర్తి చేసుకున్న తరుణం లో అందరూ ఆ సినిమా ని ఎంతగానో సెలబ్రేట్ చేసుకున్నారు.

ఇంకా శ్రీను వైట్ల దూకుడు వంటి విజయవంతమైన సినిమాలు చేస్తారు అనే నమ్మకం అందరికీ ఉంది. అయితే పుట్టిన రోజున ఈ దర్శకుడు నుంచి ఏమైనా కొత్త సినిమా ప్రకటన ఉంటుందేమో అని ప్రేక్షకులు అభిమానుకు ఆశిస్తున్నారు మరి.

హాపీ బర్త్ డే శ్రీను వైట్ల.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -