Monday, May 13, 2024
- Advertisement -

ఇలియానా ఈజ్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్….. ఆ టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో

- Advertisement -

దేవదాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఇలియానా మరో సిమ్రాన్ అనిపించుకుంది. ఆ తర్వాత పోకిరి సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆ తర్వాత నుంచీ ఇలియానాకు వెనుతిరిగి చూడాల్సిన అవసరమే లేకుండాపోయింది. వరుస ఆఫర్స్‌తో స్టార్ హీరోస్ నుంచీ చిన్న హీరోల వరకూ అందరితోనూ యాక్ట్ చేసింది. అయితే జులాయి సినిమాలో కరువొచ్చిన కంట్రీకి బ్రాండ్ అంబాసిడర్‌లా మరీ బక్కగా కనిపించడంతో ఇలియానా లుక్స్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

ఇక ఆ తర్వాత నుంచీ తెలుగు ఇండస్ట్రీ పట్టించుకోవడం మానేసింది. ఇలియానా కూడా బాలీవుడ్‌లో చాలా ప్రయత్నాలే చేసింది. అయితే అమ్మడు చేసిన సినిమాలన్నీ అక్కడ అట్టర్ ఫ్లాప్ కావడంతో చాలా కాలంగా ఖాళీగానే ఉంది. బాయ్ ఫ్రెండ్‌తో కలిసి హాట్ హాట్ ఫొటోషూట్స్ చేస్తూ ఆన్లైన్‌లో మాత్రం గ్లామర్ ప్రియులను అలరిస్తూనే ఉనింది. తాను నటించిన కో స్టార్స్ అందరిలోకి రవితేజ అంటేనే ఎక్కువ ఇష్టం అని ఇలియానా చాలా సార్లు చెప్పింది. ఇప్పుడు ఆ రవితేజనే తన సినిమాలో ఇలియానాకు ఛాన్స్ ఇచ్చాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న అమర్ అక్బర్ ఆంథోనీ సినిమాలో ఒక హీరోయిన్‌గా ఇలియానాను తీసుకున్నారు. ముందుగా ఈ పాత్రకు అను ఇమ్మాన్యుయేల్‌ని తీసుకున్నప్పటికీ నా పేరు సూర్యతో సహా అజ్ఙాతవాసి లాంటి ఫ్లాప్స్ అను ఇమ్మాన్యుయేల్ ఖాతాలో ఉన్న నేపథ్యంలో అసలే ఫ్లాప్స్‌లో ఉన్న రవితేజ, శ్రీను వైట్లకు తోడు వరుస ఫ్లాప్స్‌తో ఉన్న హీరోయిన్ కూడా ఉంటే బ్యాడ్ సెంటిమెంట్ స్ప్రెడ్ అవుతుందేమో అని భయపడి అనూని పక్కనపెట్టి ఇలియానాను తీసుకున్నారని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ కంబ్యాక్ ఫిల్మ్ అన్న క్రేజ్ అయితే ఈ సినిమాకు వచ్చే ఛాన్న్ ఉంది. మరి ఈ కంబ్యాక్ ఫిల్మ్‌తో ఇలియానా మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందేమో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -