Friday, May 10, 2024
- Advertisement -

ఇలియానా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట…

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలోకి ‘దేవదాసు’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది..గోవా బ్యూటీ ఇలియానా. నాజూకైన న‌డుమందాల‌తో కుర్ర‌కారును పిచ్చెక్కించిన బ‌క్క బ్యూటీ తక్కువ సమయంలో అగ్ర హీరోల సరసన నటించింది. తెలుగు లో మంచి ఫామ్ లో ఉండగానే బాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చి అక్కడ సక్సెస్ సాధించలేక పోయింది. తాజాగా ఢిల్లీలో నిర్వహించిన వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ మెంటల్ హెల్త్ అనే కార్యక్రమంకి హాజరైన ఈ భామ తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి చెప్పింది. ఈ కార్యక్రమంలో ఇలియానా ‘ఉమెన్‌ ఆఫ్‌ సబ్‌స్టెన్స్‌’ అవార్డు కూడా అందుకొంది.

ఇండస్ట్రీలోయి వచ్చిన కొత్తలో తన శరీరం గురించి పలువురు పలు రకాల కామెంట్స్ చేసినప్పుడు తాను చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట. నేను డిప్రెషన్‌తో బాధపడుతున్నానన్న విషయం నాకు ఎవరో చెప్పేవరకూ తెలీలేద‌న్నారు.

ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వచ్చేవి. అలాంటి సమయంలో నాకు నేను ధైర్యం చెప్పుకుంటూ నెమ్మదిగా నన్ను నేను మార్చుకుంటూ వచ్చాను. డిప్రెషన్‌ నుంచి బయటపడాలంటే మొదటగా చేయాల్సిన పని మనకు మనం ధైర్యం చెప్పుకోవడమేనన్నారు.

ఇండస్టీలోనే కాదు సొసైటీలో చాలా మంది కొన్ని సార్లు మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటారని.. కానీ అలాంటి వారు ఒక్కసారి తమకు తామే ధైర్యం చెప్పుకొని బంగారు భవిష్యత్ కి దారి వేసుకోవాలని.. డిప్రెషన్ లోకి వెళ్లినప్పుడు వెంటనే వైద్యులని సంప్రదించాలి లేదంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంటూ లెక్చర్ ఇచ్చింది ఇలియానా.

https://www.youtube.com/watch?v=2AqCcz4ILIU

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -