Sunday, April 28, 2024
- Advertisement -

గాలి ఎమ్మెల్యే టికెట్ గాల్లో..

- Advertisement -

చిత్తూరు జిల్లాలో కాక‌లు తీరిన రాజ‌కీయ యోధుడిగా గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడికి గుర్తింపు ఉంది. అలాంటి గాలికి ఇప్పుడు టెన్స‌న్ ప‌ట్ట‌కుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌కు రోజా ప్ర‌త్య‌ర్థిగా ఉండేది కాని ఇప్పుడు స్వ‌ప‌క్షంలోనె ఆయ‌న‌కు మ‌రో హీరోయిన్ చెక్ పెడుతోంది. గ‌తంలో రోజా చేతిలో అతిస్వ‌ల్ప మెజారిటి 900 ఓట్ల‌తో ఓడిపోయారు.

2019 ఎన్నిక‌ల‌మీద చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. అప్పుడైనా రోజాను మ‌ట్టిక‌రిపించి….త‌న స్థానాన్ని ద‌క్కించుకొని మంత్రి అవ్వ‌చ్చొనె ప్లాన్‌లో ఉన్నారు. అయితి ఆశ‌ల‌కు బాబు గండికొట్టార‌నె చెప్పాలి. దీంతో నిన్న‌టి వ‌కు సైలెంట్‌గా ఉన్న గాలి రోజాపై నిప్పులు చెరిగారు. న‌గ‌రిలో సీఎం ఫండ్ నుంచి భారీగా డ‌బ్బులు తెచ్చి రోడ్లు వేయించాన‌ని, పింఛ‌న్లు ఇప్పించాన‌ని తెగ ప్ర‌చారం చేసుకుంటున్నారు గాలి.

చంద్ర‌బాబు పిలుపునిచ్చిన ఇంటింటికీ టీడీపీ కార్య‌క్ర‌మాన్ని రేపో మాపో మొద‌లు పెట్టాల‌ని కూడా ఆయ‌న భావిస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని కార్య‌క్ర‌మాలూ పూర్తి చేసుకుంటున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యానికి ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోతె త‌న కొడుకుల‌ను రాజ‌కీయాల్లో దింపాల‌ని చూస్తున్నారు. నిన్న‌టి వ‌ర‌కు రోజానె ప్ర‌త్య‌ర్థి అనుకున్నారు కాని ఇప్పుడు సొంత‌పార్టీలోనె వాణివిశ్వ‌నాథ్‌రూపంలో ప్ర‌త్య‌ర్థి త‌యార‌య్యారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్సీగా ఉన్న త‌న‌కు చంద్ర‌బాబు టిక్కెట్ ఇవ్వ‌క‌పోతే త‌న ఇద్ద‌రు వార‌సుల్లో ఎవ‌రో ఒక‌రిని రంగంలోకి దింపాల‌ని గాలి ప్లాన్‌తో ముందుకు వెళుతున్నారు. అనూహ్యంగా ఇప్పుడు మాజీ తెలుగు తెర‌ సుంద‌రి వాణీ విశ్వ‌నాథ్ రాజ‌కీయ అరంగేట్రం చేయ‌డం గాలికి గాలితీసినంత ప‌న‌వుతోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాబు ఆదేశిస్తే.. తాను రోజాపై పోటీకి సిద్ధ‌మ‌ని వాణీ మీడియాకు లీకులిచ్చింది. ఇక పార్టీ అధిష్టానం నుంచి కూడా న‌గ‌రిలో రోజాపై వాణిని పోటీ చేయించే ఆలోచ‌న ఉన్న‌ట్టు మ్యాట‌ర్ లీక్ అయ్యింది. దీంతో గాలి గుండె ప‌ట్టేసుకున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో రోజాపై పోటీ అంటే.. న‌గ‌రి నుంచే చేయాలి. అంటే.. త‌న సీటుకు వాణి ఎసరు పెట్టేస్తోంద‌ని గాలి తెగ ఫీలైపోతున్నార‌ని స‌మాచారం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గాలి సీటు వాణీ కొట్టేసినా కొట్టేయొచ్చ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. దీంతో గాలికి ఇప్పుడు బాగా వాణి టెన్ష‌న్ ప‌ట్టేసుకుంది. గాలికి చెక్ పెట్టేందుకు బాబె లీకులిచ్చార‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి చూడాలి ఎన్నిల‌క నాటికి ప‌రిస్థితులు ఎలా ఉంటాయో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -