Tuesday, April 30, 2024
- Advertisement -

హీరోయిన్ ఇలియానాకు జ్వ‌రం.. వండిపెట్టిన భ‌ర్త‌

- Advertisement -

గోవా సుంద‌రి ఇలియానాకు ప్ర‌స్తుతం జ్వ‌రంతో బాధ‌ప‌డుతోంది. ఆమెకు తీవ్ర జ్వ‌రం రావ‌డంతో ఆమె భర్త ఆండ్రూ నీబోన్ ఆమె కోసం వంట వండి పెట్టి మ‌రీ ఆమెను అల్లారుముద్దుగా చూసుకున్నాడు. ఈ విష‌యాన్ని ఇలియానానే సోషల్ మీడియాలో వెల్ల‌డించింది.

ఇలియానాను ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ 2017లో కుటుంబీకుల సమక్షంలో ఆస్ట్రేలియాలోనే రహాస్యంగా వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లిపై ఇప్పటివరకు ఏనాడు ఇలియానా ప్ర‌క‌టించ‌లేదు. ‘హబ్బీ’ అంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు, వీడియోలు పోస్ట్ చేస్తోంది. అయితే ఇటీవ‌ల ఇలియానాకు అనారోగ్యం ఉంటే భ‌ర్త ఆండ్రూ మాత్రం ఆమెను క‌న్న‌తల్లిలా చూసుకుంద‌ని చెబుతున్నారు.

ఇలియానాకు ప్రస్తుతం ఆరోగ్యం బాలేదట. కొంతకాలంగా జ్వరంతో బాధపడుతోంది. దాంతో ఆండ్రూనే వంట చేసి పెట్టి దగ్గరుండి చూసుకుంటున్నారట. ఈ విషయాన్ని ఇలియానా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడిస్తూ ఫొటో పోస్ట్‌ చేశారు. ‘ఒంట్లో బాలేనప్పుడు మా ఆయన దగ్గరుండి నన్ను చూసుకుంటారు. మా ఆయన బెస్ట్‌’ అని క్యాప్షన్ ఇచ్చి ఓ ఫొటోను ఇలియానా షేర్ చేసుకుంది.ఇలియానా ఇటీవ‌ల‌ అజయ్‌ దేవగణ్‌తో ‘రెయిడ్’ సినిమా చేసింది. ఈ సినిమా విడుద‌లై మంచి టాక్ సొంతం చేసుకుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -