Thursday, May 2, 2024
- Advertisement -

NBK:భగవంత్ కేసరి బుకింగ్స్ అదుర్స్

- Advertisement -

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. రేపు(గురువారం) ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కానుండగా సింగిల్ కట్ లేకుండా సెన్సార్ ఫార్మాలిటీస్‌ని పూర్తి చేసుకుని క్లీన్ యూ సర్టిఫికెట్ పొందింది. ఇక సినిమా ప్రీ బుకింగ్స్ అదిరిపోయాయి. యుఎస్‌తో పాటు మిగితా దేశాల్లో ప్రీమియర్‌ షోలతో ముందే రానున్నాడు బాలయ్య.

ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో అడ్వాన్స్‌ బుకింగ్స్‌కి మంచి స్పందన వచ్చింది. ఒక యూఎస్‌లోనే తొలిరోజు హాఫ్ మిలియిన్ దాటినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను తెరకెక్కించారు.

ఓ వైపు ఫ్యామిలీ ఎమోషన్‌, భగవంత్ – విజ్జి పాప మధ్య సెంటిమెంట్ అద్భుతంగా ఉండనుందని అలాగే మరోవైపు బాలయ్య ఫ్యాన్స్‌కు నచ్చే మాస్ ఎలివేషన్ ఉండనుంది. సో మొత్తంగా చాలాకాలంగా బాలయ్య ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న అద్బుత సినిమా ఇది కానుందని అనిల్ చెబుతున్నారు. శ్రీలల నటనతో పాటు కాజల్ అగర్వాల్ నటన కూడా మరింత ప్లస్ కానుందని తెలుస్తోంది. మొత్తంగా భగవంత్ కేసరితో బాలయ్య ఎలాంటి మేజిక్ చేశాడో తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -