Saturday, May 4, 2024
- Advertisement -

సిద్దూ కోసం రంగంలోకి నాని -నితిన్

- Advertisement -

డీజే టిల్లు ఫేమ్ సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తుండగా ఈ బ్యానర్‌లో ఇది 30వ సినిమా.

ఈ చిత్రంతో ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతుండగా భారీ బడ్జెట్‌తో టిజి విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సినిమా టైటిల్‌ తెలుసు కదాని అనౌన్స్‌చేయగా ఇవాళ పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది.

ఈ కార్యక్రమానికి హీరోలు నాని, నితిన్, ఆది పినిశెట్టితో పాటు దర్శకుడు బాబి,హరీష్ శంకర్, నందిని రెడ్డి, వక్కంతం వంశీ, బొమ్మరిల్లు భాస్కర్, మాలిక్ రామ్ హాజరయ్యారు. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా మిగితా నటీనటుల వివరాలను వెల్లడించనున్నారు.

సిద్దూ సరరస రాశి ఖన్నా, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ అందిస్తుండగా టాప్ క్లాస్ ప్రొడక్షన్, సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. సోల్‌ఫుల్ లవ్ స్టోరీగా రూపొందనుండగా సిద్దుని కొత్త అవతార్‌లో ప్రెజెంట్ చేయనున్నారు. స్నేహం, కుటుంబం, త్యాగం, సెల్ఫ్ లవ్ కి సంబంధించిన కథగా సినిమా తెరకెక్కనుందని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -