Wednesday, May 1, 2024
- Advertisement -

విజ‌య్‌ని ఎందుకు ల‌వ్ చెయ్య‌ట్లేదో చెప్పిన ర‌ష్మిక‌

- Advertisement -

ఒక హీరో హీరోయిన్ కలిసి రెండు మూడు సినిమాలు చేస్తే వారిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ పుకార్లు పుట్టుకు రావడం చాలా సహజం. ‘గీత గోవిందం’ సినిమాలో తమ అద్భుతమైన కెమిస్ట్రీ తో ప్రేక్షకులను మెప్పించిన విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న లు సినిమాలో లిప్ లాక్ కూడా ఉండటంతో వీరిద్దరు నిజజీవితంలో డేటింగ్ చేస్తున్నారని పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇక ఇద్దరూ కలిసి మళ్లీ ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో నటిస్తుండటం వల్ల ఆ వార్తలు ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తున్నాయి. అయితే కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో డేటింగ్ పుకార్లు బయటకు వస్తే హీరోయిన్ కి ఆఫర్లు తగ్గిపోతాయి.

ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న రష్మిక మందన్న వీలైన ప్రతిసారి తనకి విజయ్ కి మధ్యలో ఏమీ లేదని చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ప్రమోషన్ల తో బిజీగా ఉన్న ఈమె విజయ్ మరియు తను కేవలం స్నేహితులు మాత్రమే అని చెబుతున్న రష్మిక మందన్న తాజాగా వేదికపై విజయ్ దేవరకొండ తో కూడా ఇదే విషయాన్ని చెప్పించింది. ఇక సినిమాల పరంగా చూస్తే రష్మిక మందన్న సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘సరిలేరు నీకెవ్వరు’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -