స్వలింగ సంప్కర నేరం కాదని తేల్చాలని తాజాగా సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలైంది. సుప్రీంలో దాఖలైన పిటీషన్ ను విచారణకు స్వీకరించారు. దీంతో ఇప్పుడు దీనిపై దేశవ్యాప్తంగా చర్చోపచర్చలు సాగుతున్నాయి.ఈ వ్యవహారంలోకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ హీరోయిన్ మహికా శర్మ.స్వలింగ సంప్కరంపై సంచలన కామెంట్స్ చేసింది మహికా శర్మ.స్వలింగ సంపర్కానికి మద్దతు పలికిన ఆమె..బాలీవుడ్ లో చాలామంది నటీనటులు – సూపర్ స్టార్లు హోమో సెక్స్‌వల్స్ అని సంచలన వ్యాఖ్యలు చేసింది. చాలా మంది స్వలింగ సంపర్కాన్ని ఇష్టపడతారని చెప్పింది.
మన దేశంలో హంతకులకు, అత్యాచారాలకు పాల్పడేవారికి ఎంతో స్వేచ్ఛ ఉందని… కానీ, హోమోసెక్సువల్స్ కు మాత్రం లేదని తెలిపింది. హోమో సెక్సువల్స్ కు స్వేచ్ఛ లభించేలా చేయాలని డిమాండ్ చేసింది. వారిలో సృజనాత్మకత కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పింది. మరి మహికా శర్మ చేసిన కామెంట్స్‌ను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.బాలీవుడ్‌లో మహికా శర్మ సినిమాలు లేక ఖాళీగా ఉంటుందని అందుకే ఆమె ఇలాంటి కామెంట్స్ చేసి వార్తల్లో నిలవాలని ప్రయత్నిస్తుందని కొందరు మహికా శర్మను విమర్శిస్తున్నారు.
