Wednesday, May 15, 2024
- Advertisement -

బాబు మార్క్ వెన్నుపోటు…. 2019తో ఆదికి రిటైర్మెంట్

- Advertisement -

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పేరు చెప్పుకుని, జగన్ ప్రాపకంతో ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణరెడ్డి ఆ తర్వాత టిడిపిలో చేరి అదే జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. జేసీని ప్రేరణగా తీసుకున్నట్టుగా ఆది కూడా రెచ్చిపోతూ ఉంటాడు. అయితే జగన్‌ని తిడితే చంద్రబాబు ఓ స్థాయిలో తనను ట్రీట్ చేస్తాడన్న ఆదినారాయణరెడ్డి ఆశలకు చంద్రబాబు నాయుడు సూపర్ షాకింగ్ వెన్నపోటు పొడవనున్నాడా? 2019 ఎన్నికల తర్వాత ఆది నారాయణరెడ్డి రాజకీయ జీవితానికి రిటైర్మెంట్ ఖాయమా? అన్న ప్రశ్నలు ఇప్పుడు కడపలో వినిపిస్తున్నాయి.

టిడిపి నాయకులు, కేడర్ మాత్రం 2019 ఎన్నికల తర్వాత ఆది ఖాళీ అవుతాడని చెప్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డికి టికెట్ ఇచ్చే ఉద్ధ్యేశ్యం చంద్రబాబుకు అస్సలు లేదని టిడిపి వ్యూహకర్తలు చెప్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలలో ఎక్కువమందిపై ప్రజల్లో ఆగ్రహం ఉందని చంద్రబాబు సొంత సర్వేలోనే తేలింది. అన్నింటికీ మించి టికెట్ ఇవ్వడంతో పాటు గెలిపించడం వరకూ అన్ని విధాలుగానూ బాగా చూసుకున్న జగన్‌కే వెన్నుపోటు పొడిచిన ఆదినారాయణరెడ్డి రేపు తన విషయంలో మాత్రం నమ్మకంగా ఎందుకు ఉంటాడన్న ఆలోచన చంద్రబాబుకు ఉందని తెలుస్తోంది. అందుకే 2019 ఎన్నికల్లో ఆది ప్లేస్‌లో రామసుబ్బారెడ్డికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు చంద్రబాబు.

అయితే ఆదినారాయణరెడ్డి వళ్ళ ఎన్నికల్లో నష్టం జరగకుండా ఉండేందుకు ఆదికి కడప ఎంపి టికెట్ ఆఫర్ చేశాడట. కడప ఎంపి నియోజకవర్గంలో టిడిపి గెలవడం అనేది కలలో మాట. లక్షల మెజార్టీతో వైకాపా గెలిచే చోట తెలివిగా ఆదినారాయణరెడ్డిని బలిపశువును చేసే వ్యూహరచన చంద్రబాబు చేశాడని టిడిపి నాయకులే మాట్లాడుకుంటున్నారు. 2019 ఎన్నికల తర్వాత చాలా మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల తలరాతలు పూర్తిగా తిరగబడతాయని ఇప్పటికే రాజకీయ మేధావులు హెచ్చరించి ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్టులో ఆదినారాయణరెడ్డి పేరు కూడా చేరిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -