Friday, March 29, 2024
- Advertisement -

సుమ కాళ్ల‌కు మొక్కిన రానా…అక్క‌డున్న వారంతా షాక్‌..

- Advertisement -

ఫంక్షన్ ఏదైనా యాంకర్ సుమ తనదైన మాట‌ల శైలిలో అంద‌ర్నీ ఆక‌ట్టుకోవడంలో ఆమె శైలే వేరు. టీవీ, యూట్యూబ్‌లో కార్యక్రమాన్ని చూసే వీక్షకులు ఆమె మాటలకు ఫిదా అవుతుంటారు. స్టేజీ మీద నటీనటులను ఆటపట్టించడంలో సుమ శైలికి ప్రత్యేకంగా ఉంటుంది. తాజాగా జెర్సీ సినిమా థ్యాంక్యూ మీట్‌లో ఓ సరదా సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకొన్నది.

నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా వచ్చిన జెర్సీ చిత్రం విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం హైదరాబాద్ లో థాంక్యూ మీట్ నిర్వహించింది. ఈ కార్య‌క్ర‌మానికి యాంక‌ర్‌గా సుమ వ్య‌వ‌హ‌రించారు.ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు రానా కూడా హాజ‌ర‌య్యారు.

మైక్ అందుకున్న రానా మాట్లాడుతూ, తనకు క్రికెట్ అన్నా, అమ్మాయిలు, పెళ్లి, పిల్లలు అన్నా పెద్దగా ఆసక్తి ఉండదని తెలిపారు. అలాంటిది జెర్సీ సినిమా చూశాక కంటతడి పెట్టకుండా ఉండలేకపోయానని, ఇక మామూలు ప్రేక్షకుడి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు.

రానా వ్యాఖ్యలపై స్పందించిన సుమ‌..వెంటనే మైక్ అందుకుని మీకు త్వరలోనే అమ్మాయిలు, పెళ్లి, పిల్లల గురించి బాగా అర్థం కావాలని కోరుకుంటున్నాం అనగానే రానా వెంటనే సాష్టాంగ నమస్కారం చేశారు. అంతేకాకుండా కాళ్లు మొక్కే ప్రయత్నం చేయడంతో సుమ కంగారు పడింది. వెంటనే కాళ్లు వెనక్కు లాగే ప్రయత్నం చేశారు.

సుమ మాట్లాడుతూ, అందరూ పెళ్లి చేసుకుని కష్టపడుతుంటే మీరు మాత్రం సుఖంగా ఉండాలా? అందుకే మీరు కూడా పెళ్లి చేసుకుని పిల్లల్ని కని, అమ్మాయిల మనసు అర్థం చేసుకోవాలి అంటూ రానాను కవ్వించేలా బదులిచ్చారు. యాంకర్ సుమ, రానా మధ్య వేదికపై చోటుచేసుకొన్న సన్నివేశం ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకొన్నది. అంతేకాకుండా ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఏది ఏమైనా రానా, సుమ మాటల విసుర్లు కార్యక్రమాన్ని ఆహ్లాదకరంగా మార్చాయి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -