మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీ కొల్లితో మరోసారి కలిసి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన విడుదల కాగా, స్క్రిప్ట్ కూడా పూర్తిగా లాక్ అయినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ప్రీ–ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతుండటంతో ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.
చిరు–బాబీ కాంబోలో గతంలో వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో, ఈ కొత్త సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అందుకే దీనికి సంబంధించిన చిన్న అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌పై ఓ క్రేజీ న్యూస్ హల్‌చల్ చేస్తోంది. మేకర్స్ ఈ సినిమాకు ‘కాకాజీ’ (Mega 158) అనే పవర్‌ఫుల్, డిఫరెంట్ టైటిల్‌ను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం.
ఈ సినిమాలో చిరంజీవి ఇప్పటివరకు కనిపించని కొత్త లుక్‌లో దర్శనమివ్వనున్నారని తెలుస్తోంది. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో సెట్ అయిన కథలో మాఫియా డాన్ పాత్రలో చిరు నటించనున్నాడట. అందుకే ‘కాకాజీ’ అనే బలమైన టైటిల్‌ను ఎంచుకున్నారని టాక్. ఈ సినిమాలో చిరంజీవికి భార్య, కూతురు ఉన్న పాత్రగా కనిపిస్తారట.
భార్య పాత్రలో ప్రియమణి నటిస్తుండగా, కూతురి పాత్రకు కృతి శెట్టి లేదా అనశ్వర రాజన్‌లలో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయాలపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మొత్తం చూస్తే, మెగాస్టార్ కెరీర్‌లో మరో భారీ హిట్ పడటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
