- Advertisement -

అడివి శేష్ సినిమాకు నిర్మాతగా జగపతిబాబు!

- Advertisement -

2025లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిత్రం లిటిల్ హార్ట్స్. తొలి సినిమాతోనే దర్శకుడు సాయి మార్తాండ్‌ ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. సినిమా విడుదలై కొన్ని నెలలు గడిచినా, ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

అయితే, తాజాగా అందిన ప్రత్యేక సమాచారం ప్రకారం, సాయి మార్తాండ్‌ తదుపరి సినిమా టాలీవుడ్‌ టాలెంటెడ్‌ హీరో అదివి శేష్‌తో ఉండబోతోంది. ప్రస్తుతం డాకాయిట్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న శేష్‌, ఈ కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇద్దరి మధ్య కథా చర్చలు పూర్తయ్యాయి, నరేషన్ కూడా ముగిసింది. అన్ని ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో 2026 మే నెలలో షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారట.

ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ సినిమాను బహుముఖ నటుడు జగపతి బాబు నిర్మించనుండటం. ప్రముఖ నిర్మాత ఏషియన్‌ సునీల్ నారంగ్‌తో కలిసి ఆయన ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లనున్నారు. ఇదే సమయంలో, ఈ రోజు దర్శకుడు సాయి మార్తాండ్‌ పుట్టినరోజు సందర్భంగా అదివి శేష్‌ శుభాకాంక్షలు తెలపడంతో, ఈ ఎక్స్‌క్లూజివ్‌ వార్తకు మరింత బలం చేకూరింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -