Wednesday, May 15, 2024
- Advertisement -

శంకర్ ఆశలు అడియాసలై పోతాయా

- Advertisement -

బాహుబలితో రాజమౌళి ఇమేజ్ ఇంటర్నేషనల్ స్థాయికి పోయింది. పాపులర్ మీడియా సంస్థలన్నీ రాజమౌళి వర్క్ ను ఎంతగానో మెచ్చుకున్నాయి. కాని రాజమౌళి కంటే ముందు దేశవ్యాప్తంగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న దర్శకుడు శంకర్. రాజమౌళి కమర్షియల్ చిత్రాల బాట పడితే.. శంకర్ సినిమాల్లో కమర్షియల్ వాల్యూస్ తో పాటుగా దేశభక్తికి సంబందించిన అంశం కూడా ఉంటుంది.

శంకర్ చిత్రాలకు అనేక అవార్డులు కూడా వచ్చాయి. కాగా రోజురోజుకు ఎదుగుతూ శంకర్ హాలీవుడ్ చిత్రాలపై కన్నేశాడనే ప్రచారం జరిగింది. శంకర్ హాలీవుడ్ ట్రైల్స్ కు ‘ఐ’ సినిమా బ్రేకులు వేసేసింది. ఆ సినిమా ఫెయిల్యూర్ కావడంతో మరో మూవీ ద్వారా శంకర్ తన సత్తాని ప్రూవ్ చేసుకోవాలని చూసాడు. బట్ ఈలోపే జక్కన్న బాహుబలితె అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. బాలీవడ్ బడా హీరోలే రాజమౌళితో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మాములుగానే శంకర్, రాజమౌళి మధ్య వార్ ఏర్పడిందనే మాటలు వస్తున్నాయి. ఎట్ ప్రజెంట్ శంకర్ రజినీతో 2.0 అనే సినిమా రూపొందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. బాహుబలికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉండాలని శంకర్ భావిస్తున్నాడట. అందుకోసం అద్భుతమైన గ్రాఫిక్స్ ని ఈ చిత్రంలో చొప్పించాలనే శంకర్ వ్యూహం బెడిసికొట్టినట్లు విడుదలకు ముందే నెగిటివ్ ప్రచారం మొదలైపోయింది.

ఇటీవల దుబాయ్ లో ఈ చిత్ర ఆడియో వేడుక ఘనంగా జరిగింది. మొదట జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు. కానీ అనూహ్యంగా 2.ఓ వాయిదా పడింది.దీనికి కారణం…. 2.౦ లో గ్రాఫిక్స్ సంతృప్తి కరంగా లేకపోవడంతో వాటిని సెట్ చేయమని శంకర్ భావిస్తున్నాడట. తిరిగి గ్రాఫిక్స్ రూపొందించడానికి ఎక్కువ సమయం కావలసి ఉండడంతో సినిమాని వాయిదా వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్ర సంగీతం, పోస్టర్ ల మ్యాటర్లో రజినీ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం పరమ చెత్తగా ఉందని ఫాన్స్ అంటున్నారు. పోస్టర్ లలో అమీజాక్సన్, రజినీ ధరించిన కాస్ట్యూమ్స్ కూడా బాగాలేవనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంత ప్రతికూల పరిస్థుతుల మద్య శంకర్ ఏం సాధిస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -