Sunday, May 19, 2024
- Advertisement -

ఆయనగారి కొడుకు కదా…. అలాగే కొడతాడు

- Advertisement -

బూతు చిత్రాల నుంచి ఓ మోత మోగించే చిత్రాల చేసే స్థాయికి ఎదిగాక మారుతికి మంచి పేరొచ్చింది. భలే భలే మొగాడివోయ్‌ సినిమాతో స్టార్‌ లీగ్‌ లోకి ఎంటర్‌ అయిపోయాడు. ఇటీవల మహానుభావుడు సినిమాతో మరో హిట్ ను కొట్టి… త్వరలో నాగచైతన్యతో శైలజా రెడ్డి అల్లుడు అనే ఫిలింను తెరకెక్కించ బోతున్నాడు.ఈ చిత్రంకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న మారుతి తన సోషల్‌ మీడియా పేజ్‌లో ఓ సరదా పుట్టించే ఆసక్తికర వీడియోను పోస్ట్‌ చేశాడు.

ఈ పోస్ట్ లో మారుతి తన ఫ్యామిలి హీరోని బయటకు తీసుకువచ్చాడు. తాజాగా ఆయన తన వారసుణ్ని అభిమానులకు పరిచయం చేశాడు. డ్రమ్స్‌ వాయిస్తున్న తన కొడుకు ఆశ్రిష్‌ వీడియోను ట్విట్టర్‌ పేజ్‌లో పోస్ట్‌ చేసిన మారుతి ‘మా అబ్బాయి కొత్త వీడియో’ అంటూ కామెంట్‌ చేశాడు. ఈ వీడియోలో మారుతి కొడుకు డ్రమ్స్‌ వాయించేస్తూ తెగ హడావిడి చేస్తున్నాడు. తండ్రి కామెడీ ఎంటర్‌ టైనర్‌లతో ఆకట్టుకుంటుంటే ఆశ్రిష్‌ సంగీత వాయిద్యాలతో మైమరపిస్తున్నాడు. ఈ కుర్రాడి జోరు చూస్తుంటే టాలీవుడ్‌కి దేవి శ్రీ ప్రసాద్ మాదిరిగా మరో మ్యూజిక్ డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చేస్తున్నాడా అనిపిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -