Saturday, May 11, 2024
- Advertisement -

రాజ్ తరుణ్ భారీ రిస్క్ – సినిమాకి సంతకం పెట్టారు

- Advertisement -

ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్తా మామా అంటూ వరస హిట్ లు కొడుతున్న హీరో రాజ్ తరుణ్ ఇప్పుడు తెలుగు డైరెక్టర్ లకి చాకు లాంటి హీరోగా దొరికాడు. తక్కువ బడ్జెట్ సినిమా చెయ్యచ్చు, అంతకంటే తక్కువగా ఈ కుర్రాడికి రెమ్యునరేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉండడం తో డైరెక్టర్ లు తమ అదృష్టం పరీక్షించుకునే పనికి ఈ కుర్రాడ్ని వాడడానికి ట్రై చేస్తున్నారు.

మొదట షార్ట్ ఫిలిం లలో హీరోగా చేసి, అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎదిగి ఇప్పుడు హీరోగా మారిన రాజ్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. 

కాంపిటీషన్ ఎక్కువగా ఉంది అనుకున్నాడో లేక దీపం ఉండగా నే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని చూస్తున్నాడో గానీ అన్ని సినిమాలూ ఒప్పేసుకుంటున్నాడు ఈ కుర్రాడు. ప్రస్తుతం సుకుమార్ నిర్మాణం లో కుమారీ 21 ఎఫ్ ని పూర్తి చేసిన రాజ్ మరొక రెండు సినిమాలు సిద్దంగా పెట్టుకున్నాడు, కానీ ఆ రెండు సినిమాలూ అతనికి చాలా పెద్ద రిస్క్ ప్రాజెక్ట్ లు గా చెప్పాలి. 

రామ్ _గోపాల్_వర్మ దర్శకత్వంలో మూకీ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు తరుణ్ . కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలో వర్మ దర్శకత్వంలో నటించటమే రిస్క్ …అలాంటిది మూకీ సినిమా చేయటం అంటే సాహసమే. ఇదే పెద్ద సాహసం అంతే కంటే ఆసక్తికరంగా రేయ సినిమా తో భారీ పరాజయం రుచి చూసిన  వై వీ యస్ చౌదరి ని ఏ హీరో దగ్గరకి కూడా రానివ్వని తరుణంలో ఇప్పుడు రాజ్ తరుణ్ ఆయన సినిమా ఒకదానికి సంతకం పెట్టాడు. ఇది అన్నిటికంటే పెద్ద రిస్క్ గా చెప్పాలి .

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -