Thursday, April 18, 2024
- Advertisement -

మెగా అభిమానులకు షాక్….సైరా’ విడుదల తేదీ వాయిదా…?

- Advertisement -

చిరంజీవి కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ‘సైరా’ చిత్రం . ఇప్పుడు మెగా అభిమానుల‌తో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కూడా సైరా న‌ర‌సింహా రెడ్డి చిత్ర విడుద‌ల తేదీ కోస‌మే చూస్తున్నారు.స్వాతంత్య్ర పోరాట యోధుడు ఉయ్యాల వాడ నరశింహారెడ్డి కథతో ఈ సినిమా రూపు దిద్దుకోంది.గాంధీ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 2వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.

ఇక సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది షాకింగ్ వార్తే. సైరా సినిమా రిలీజ్ వాయిదా పడిందనె వార్తలు వినిపిస్తున్నాయి. అదేరోజు హిందీలో వార్’ సినిమా భారీస్థాయిలో విడుదలవుతోంది. హృతిక్ రోషన్ .. టైగర్ ష్రాఫ్ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.

ఈ సినిమా కారణంగా అక్కడ ‘సైరా’కి ఆశించిన స్థాయిలో థియేటర్స్ దొరకడం లేదట. అందువలన ఒక వారం రోజుల పాటు ‘సైరా’ విడుదల వాయిదా వేయడం మంచిదని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు చరణ్ ను కోరినట్టుగా సమాచారం. మరో వైపు దసరా సెలవులు కలసి వస్తాయనె ఉద్దేశ్యంతో అక్టోబర్ 8వ తేదీన ‘సైరా’ను విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే చరణ్ గాని, సినిమా యూనిట్ గాని అధికారికంగా ప్రకటించ వలసి ఉంది. ఈ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -