Saturday, May 18, 2024
- Advertisement -

గుజ‌రాత్ సముద్ర తీరంలోకి పాక్ క‌మాండోలు…ఐబీ హెచ్చరిక, గుజరాత్ లో హైఅలర్ట్

- Advertisement -

జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్థాన్ రగిలిపోతోంది. అంతర్జాతీయంగా ఒంటరి కావడంతో ఎలాగైనా భారత్ పై ప్రతీకారం తీర్చుకోవాలని అదునుకోసం ఎదురు చూస్తోంది. సరిహద్దుల్లో 100 మంది కమోండోలను మోహరించిన పాక్ ..సరిహద్దుల గుండా టెర్రరిస్టులను చొప్పించేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. తాజాగా మరో దుస్సాహసానికి పూనుకుంది.

తమ కమెండోలను భారత భూభాగంలోకి చొప్పించేందుకు యత్నిస్తోంది. సముద్ర మార్గం గుండా కచ్ ఏరియాలోకి పాక్ కమెండోలు చొరబడేందుకు యత్నిస్తున్నారనే విషయాన్ని ఇంటెలిజెన్స్ గుర్తించింది.దీంతో గుజరాత్ లోని అన్ని పోర్టుల్లో హైఅలర్ట్ ప్రకటించింది.

చిన్నపాటి పడవల ద్వారా పాక్‌ నేవీతో శిక్షణ పొందిన ఉగ్రవాదులు, కమాండోలు గుజరాత్‌లోని కచ్‌,సర్‌ క్రీక్‌ ప్రాంతాలకు చేరుకోవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. గుజరాత్‌ తీరం, ఇతర రేపుల్లో అండర్‌వాటర్‌ దాడులు జరగవచ్చన్న సమాచారంతో గుజరాత్‌ తీరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.వీరు నీళ్లలోనే దాడులు చేసేందుకు పాకిస్థాన్ నేవీ ట్రైనింగ్ ఇచ్చిందని .. ముఖ్యంగా పోర్టులు, షిప్పులను పేల్చివేసే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చింది.ఐబీ హెచ్చరికలతో కోస్ట్ గార్డు, పోర్టు, కోస్టల్ పోలీసులు, ఇండియన్ నేవీ అధికారులు అలర్టయ్యారు

దానీ పోర్ట్స్ సెజ్ ఓ ప్రకటనను వెలువరించింది. గల్ఫ్ ఆఫ్ కచ్ లోకి పాకిస్థాన్ కమెండోలు ప్రవేశించారనే సమాచారం కోస్ట్ గార్డ్ స్టేషన్ నుంచి తమకు వచ్చిందని ప్రకటనలో తెలిపింది. హరామీ నాలా జలాల గుండా వారు ప్రవేశించారని… అండర్ వాటర్ దాడుల్లో వారు శిక్షణ పొందారనే సమాచారం ఉందని వెల్లడించింది. ముంద్రా పోర్టులోని అన్ని నౌకల పట్ల కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకోవాలని సూచించినట్టు తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -