Sunday, May 12, 2024
- Advertisement -

‘రాక్షసుడి’గా బెల్లంకొండ అలరించగలడా?

- Advertisement -

నటించిన ప్రతి సినిమాలోనూ ఒక నటుడిగా మంచి మార్కులు వేయించుకుంటూ వస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా మంచి విజయాన్ని అందుకోలేకపోయాడు. డిజాస్టర్ లతో సతమతమవుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ మధ్యనే నటించిన ‘సీత’ సినిమా కూడా డిజాస్టర్ గా మారింది. తాజాగా బెల్లంకొండ ‘రాక్షసుడు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘రాట్సాసన్’ సినిమాకి రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘రాక్షసుడు’ సినిమా లో బెల్లంకొండ హీరోగా నటిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. సినిమా ఎక్కడా బోర్ కొట్టించకుండా ఆసక్తికరంగా సాగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఒక సైకో కిల్లర్ ని వేటాడే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా రేపు అనగా ఆగస్టు 2న విడుదల కాబోతోంది. ఈ సినిమా సక్సెస్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ లో కీలకం కాబోతోంది. మరి ఈ సినిమాతోనైనా బెల్లంకొండ కెరీర్ గాడిలో పడుతుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -