Saturday, April 20, 2024
- Advertisement -

‘మన్మధుడు 2’ సినిమాకి నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

- Advertisement -

టాలీవుడ్ కింగ్ నాగార్జున మార్కెట్ బాగా పడి పోయిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే విడుదలైన ‘దేవదాసు’ సినిమా కూడా డిజాస్టర్ అవ్వడం నాగార్జున మార్కెట్ పై బాగానే ప్రభావం చూపింది. కానీ రెమ్యూనరేషన్ పరంగా నాగార్జున ఏ మాత్రం తగ్గడం లేదని తెలుస్తోంది. తాజాగా నాగార్జున హీరోగా నటించిన ‘మన్మధుడు 2’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ‘చి ల సౌ’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం నాగార్జున 20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే నాగార్జున ఈ సినిమాకి హీరో మాత్రమే కాకుండా నిర్మాత కూడా. ఈ సినిమా కోసం 24 కోట్ల బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. అనుకున్న సమయంలో అనుకున్న బడ్జెట్ కంటే మించకుండా షూటింగ్ జరపటంతో 24 కోట్లతో సినిమా పూర్తయింది. సినిమా డిజిటల్ రైట్స్ అని, థియేట్రికల్ రైట్స్ అని ఇప్పటికి ఇరవై కోట్ల వరకు వరకు వచ్చేసిందట. అంటే నిర్మాతగా వ్యవహరించిన నాగార్జునకి 20 కోట్లు తిరిగి వచ్చిందన్నమాట. లక్ష్మీ, దేవదర్శిని, వెన్నెల కిషోర్, రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఆగస్టు 9న విడుదల కాబోతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -