Friday, May 17, 2024
- Advertisement -

ఇస్మార్ట్ కాస్త అతిగా మారుతుంది

- Advertisement -

ఇస్మార్ట్ శంకర్ ఈ నెల 18 న విడుదల కానుంది. ఈ సినిమా ఫైనల్ కాపీ కి సంబందించిన స్క్రీనింగ్ పూర్తి అయింది. రామ్ సినిమా చూసి తనకి అనిపించినా ఫీలింగ్ ని షేర్ చేసాడు.

“ఇప్పుడే ఇస్మార్ట్ శంకర్ సినిమా చూసాను. దీనెమ్మ కిక్కు… ఇంత హై ఫీలింగ్ నాకు ఏ పాత్ర చేసినప్పుడూ కలగలేదు. అలాగే చూస్తున్నప్పుడు కూడా ఈ ఫీలింగ్ రాలేదు. కానీ ఈ రోజు నాకు పాత్ర చేసేటప్పుడు, చూసేటప్పుడు ఒకే ఫీలింగ్ ఉంది. ఇలాంటి సినిమాని నేను ఇప్పటి వరకు చూడలేదు. పూరి జగన్ సర్ కి నిజం గా థాంక్స్. చాలా మంది కి తెలియదు కానీ ఆయన ఒక డ్రగ్.” అని రామ్ చెప్పాడు.

దీని పూరి రిప్లై ఇస్తూ, “డ్రగ్ అని చెప్పడం నా లైఫ్ లో నే ఒక పెద్ద కాంప్లిమెంట్. ఈ కిక్ నాకు నీ వల్లనే వచ్చింది. నీ ఎనర్జీ వల్లనే ఇస్మార్ట్ శంకర్ ఇంత బాగా వచ్చింది. సినిమా ఐపోయాక నువ్వు నాకు ఇచ్చిన హగ్ నేను ఎప్పటికీ మర్చిపోను. నువ్వు ఒక మంచి నటుడివి. మాకి కిరికిరి. మనం రాక్ చేయబోతున్నాం సినిమా తో.” అని చెప్పాడు.

చార్మీ కూడా మధ్యలో దూరి, “ఈ సినిమా ఫైనల్ కాపీ చూసాక నాకు ఈ సినిమా మీద నమ్మకం మరింత పెరిగింది. సినిమా మీద నాకున్న ఆశ డబుల్ అయింది. శంకర్, ఐ లవ్ యు. ఇస్మార్ట్ శంకర్ రాక్ చేయబోతుంది. అందరూ ఫుల్ మీల్స్ కి రెడీ అవ్వండి 18 తారీఖున. దాని తర్వాత డబుల్ ఇస్మార్ట్ రాబోతుంది. నేను ప్రామిస్ చేస్తున్నాను.. రామ్, నువ్వు తురుము రా.” అని చెప్పింది.

అయితే ఇదంతా బాగానే ఉంది కానీ ఎవడి సినిమా ని వాడు రిలీజ్ కి ముందే ఈ రేంజ్ లో పొగుడుకోవడం మామూలే, పైగా వీళ్ళు మరింత చేస్తూ సినిమా మీద ఉండే ఇంట్రెస్ట్ ని కిల్ చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళు చెప్పిన రేంజ్ లో సినిమా లేకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి.” అని అందరూ అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -