Wednesday, May 8, 2024
- Advertisement -

మహిళతో క్రికెటర్‌ అసభ్య ప్రవర్తన..ఆప్ఘ‌న్ పేస‌ర్‌పై ఏడాదిపాటు నిషేధం

- Advertisement -

మ‌హిళ ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన ఆప్ఘ‌న్ పేస్ బౌల‌ర్ అఫ్తాబ్‌ ఆలమ్‌ పై జాతీయ‌, అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఆడ‌కుండా సంవ‌త్స‌రంపాటు నిషేధం విధించింది ఆప్ఘ‌న్ క్రికెట్ బోర్డు. అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు, దేశవాళీ టోర్నీలకూ దూరంగా ఉండాలంటూ అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు అతన్ని హెచ్చరించినట్లు స‌మాచారం.

ప్రపంచకప్‌లో జూన్‌ 22న సౌతాంప్టన్‌లో భారత్‌తో ఆడిన మ్యాచే అతనికి చివరిది. ఈ మ్యాచ్‌ అనంతరం సౌతాంప్టన్‌ హోటల్‌లో ఒక మహిళతో అఫ్తాబ్‌ తప్పుగా ప్రవర్తించినట్లు తేలింది. దీంతో జూన్‌ 23న ఐసీసీ అవినీతి నిరోధక యూనిట్‌ సమావేశానికి హాజరై వివరణ ఇవ్వాలని కోరగా… అతను కావాలని సమావేశానికి గైర్హాజరవ్వడంతో కోచ్‌ ఫిల్‌ సిమన్స్‌ తర్వాతి రెండు మ్యాచ్‌ల నుంచి అఫ్తాబ్‌ను తప్పించారు. దీంతో త‌దుప‌రి మ్యాచ్‌ల‌కు దూర‌మ‌య్యాడు. త‌ర్వాత‌ఈ ఘటనపై అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు క్రమశిక్షణా కమిటీ విచారించి గత వారం జరిగిన సర్వసభ్య సమావేశంలో 26 ఏళ్ల అఫ్తాబ్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -