Sunday, May 5, 2024
- Advertisement -

ఇస్మార్ట్ హెచ్చరికలు పని చేశాయి

- Advertisement -

ఇస్మార్ట్ శంకర్ సినిమా కోసం దాదాపు అందరూ వేచి చూస్తున్న సంగతి తెలిసిందే. సినిమా ముందు నుంచి కాస్త బోల్డ్ గా, ఘాటుగా ఉండబోతుంది అని దర్శక నిర్మాతలు చెప్పుకొచ్చారు. అయితే హీరో రామ్ కూడా కాస్త ముందు జాగ్రత్త పడుతూ సినిమా ఎవరి కోసం తీసాడో, ఎందుకు తీశారో, సినిమా పర్పస్ ఏంటి అనే విషయాల మీద క్లారిటీ ఇచ్చేసాడు. తాము సినిమా లో ఏం చెప్పబోతున్నాము అనే విషయం మీద పూర్తి క్లారిటీ ఇస్తూ, దానికే రెడీ గా ఉండాలని హెచ్చరించాడు కూడా. అయితే విచిత్రం ఏంటి అంటే ఈ సినిమా నిజం గా రామ్ చెప్పినట్టు కాస్త ఘాటుగానే ఉంది.

అయితే ఇదే సినిమా ని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ హెచ్చరిక లేకుండా విడుదల చేసి ఉంటె ఈ పాటికి ఫెమినిస్ట్స్, వాళ్ళు, వీళ్ళు, అందరూ కలిసి రామ్ ని, దర్శకుడు పూరి జగన్నాథ్ ని విపరీతం గా విమర్శించేవారు. గత కొన్ని రోజులుగా సినిమా చేయాలంటే, వాళ్లేమంటారో, వీళ్ళేమంటారో, ముఖ్యం గా ఫెమినిస్ట్స్ ఏమంటారో అని భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యం లో సినిమా ఎలా ఉండబోతుంది అనేది చాలా క్లియర్ గా చెప్పేసాడు రామ్. అందుకు ఏ మాత్రం తీసిపోలేదు సినిమా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -