Thursday, April 25, 2024
- Advertisement -

పునరాలోచన లో విజయ్ దేవరకొండ

- Advertisement -

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తో పని చేయడానికి దర్శకులు ఎప్పటికి అప్పుడు రెడీ గా ఉంటారు అనే విషయం మన అందరికీ తెలిసిందే. అయితే విజయ్ దేవరకొండ తన డేట్స్ ఎవరికీ ఇస్తాడా అని చాలా మంది నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. కానీ విజయ్ ఒక దర్శకుడికి మాట ఇచ్చాడు అంటే, కచ్చితంగా ఆ మాట మీద ఉండి సినిమా చేస్తాడు. ఇప్పుడు చేస్తున్న డియర్ కామ్రేడ్ అలా చేస్తుందే. ఒకప్పుడు దర్శకుడు భరత్ కమ్మ కి మాట ఇచ్చిన విజయ్ ఆ మాట కి కట్టుబడి సినిమా చేసాడు. క్రాంతి మాధవ్ అనే దర్శకుడి తో కూడా సినిమా చేస్తాను అన్నాడు. ఇప్పుడు చేస్తున్నాడు.

అయితే ఇటీవలే దొరసాని సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆ సినిమా దర్శకుడు మహేంద్ర కి సినిమా చేస్తా అని మాట ఇచ్చాడు. అయితే దొరసాని వైఫల్యం తర్వాత విజయ్ కి కొంత మంది మాట వెనక్కి తీసుకోమని చెపుతున్నారట. నిజానికి వెంటనే ఒక కథ రెడీ చేయమని విజయ్ దర్శకుడికి చెప్పాడు కానీ ఇప్పుడు తాజా పరిస్థుతుల నేపథ్యం లో విజయ్ ఆ మాట వెనక్కి తీసుకోనున్నట్లు తెలుస్తుంది.

అయితే ఇండస్ట్రీ లో ఇవన్నీ కామన్ అని, బూతద్దం లో పెట్టి చూడాల్సిన అవసరం ఏమి లేదని కొందరు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -