Saturday, May 11, 2024
- Advertisement -

ఇస్మార్ట్ శంకర్ టీజర్: బోల్డ్.. హార్డ్.. పక్కా మాస్..

- Advertisement -

పూరి జగన్నాథ్ మరియు రామ్ పోతినేని కలిసి మన ముందుకు ఇస్మార్ట్ శంకర్ సినిమా తో రానున్నారు. అయితే ఎప్పటి నుంచో ఈ సినిమా గురించి వార్తలు వస్తున్నప్పటికీ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయం మీద క్లారిటీ లేకుండా పోయింది. అయితే ఈ సినిమా టీజర్ నేడు విడుదల చేసిన దర్శక నిర్మాతలు ఈ సినిమా నుండి ఏమి ఆశించాలో చెప్పేసారు. హీరో రామ్ పుట్టిన రోజు సందర్భం గా విడుదల అయినా ఈ టీజర్ చాలా మాస్ ఎలిమెంట్స్ తో నిండి ఉంది. రామ్ పాత్ర ని తీర్చిదిద్దిన తీరు చూస్తే పూరి జగన్నాథ్ తనకి అచ్చి వచ్చిన కథాంశాన్ని రామ్ కి అనుగుణం గా మార్చుకున్నట్లు తెలుస్తుంది.

హైదరాబాద్ వీధుల్లో పక్కా మాస్ గా బోల్డ్ గా తిరిగే పాత్ర చుట్టూ అల్లుకున్న ఈ కథ కి మణిశర్మ మంచి సంగీతాన్ని అందించారు. టీజర్ లో బాక్గ్రౌండ్ లో వచ్చే సాంగ్ అయితే హీరో కారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయింది అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే సినిమా లో కమర్షియల్ అంశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఒక్కటే లోటు ఏంటి అంటే పూరి లాంటి మంచి దర్శకుడి నుండి మళ్ళి రొటీన్ కథ రాబోతుంది. అయితే రొటీన్ కథ ని ఈ సారి అయినా మెప్పించేలా తీస్తే అభిమానులకి అంతకన్నా ఏం కావాలి చెప్పండి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -