Thursday, May 16, 2024
- Advertisement -

అనవసరం గా చిక్కులు తెచ్చుకుంటున్న ఇస్మార్ట్ శంకర్

- Advertisement -

పూరి జగన్నాథ్ దర్శకత్వం లో రామ్ పోతినేని హీరో గా రానున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా కి సంబందించిన థియాట్రికల్ ట్రైలర్ ని నిన్న ఆన్లైన్ లో కి విడుదల చేశారు దర్శక నిర్మాతలు. అయితే ట్రైలర్ తో సినిమా మీద పాజిటివ్ బజ్ తెచ్చుకుందాం అని భావించిన దర్శక నిర్మాతలకి ఇప్పుడు అనూహ్యంగా ఎదురు దెబ్బ తగిలింది.

సినిమా లో కొత్త కథ చెపుతున్నాం అని అనుకున్న వారందరికీ ఈ సినిమా ట్రైలర్ చూసాక ఇది ఆంగ్లం లో వచ్చిన క్రిమినల్ అనే సినిమా కి కాపీ అని తెలిసిపోయింది. అది పక్కన పెడితే హీరోయిన్ల తో ఉన్న శృంగార సన్నివేశాలకి సంబందించిన విజువల్స్ చూసిన చాలా మంది ఇది అడల్ట్ సినిమా అని, ఈ సినిమా కి సెన్సార్ బోర్డు నుండి చిక్కులు తప్పవు అని టాక్ స్ప్రెడ్ చేయడం మొదలు పెట్టారు. ట్రైలర్ విడుదల అయ్యాక అందరూ ట్రైలర్ గురించి మాట్లాడతారు అనుకుంటే ఇలా వివాదాల టాపిక్ ఎక్కువ అవుతుండటం తో చిత్ర యూనిట్ కి ఏం చెయ్యాలో అర్ధం కానీ పరిస్థితి దావురించింది.

అయితే ఈ సినిమా లో అలంటి సన్నివేశాలు ఏమి లేవు, సినిమా చాలా బాగుంటుంది అని చిత్ర యూనిట్ చెప్పుకుంటున్నా ఎవరూ నమ్మడం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -