Monday, May 6, 2024
- Advertisement -

బాబు అరెస్ట్‌ తప్పదా…? టీడీపీలో సంచ‌ల‌నం రేపుతున్న భాజాపా నేత వ్యాఖ్య‌లు

- Advertisement -

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఓటమితో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. వైఎస్ జ‌గ‌న్ కంటే భాజాపాతోనె బాబుకు పెద్ద స‌మ‌స్య‌. ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించ‌న‌ని జ‌గ‌న్ ఇప్ప‌టికే బాబుకు అభ‌యం ఇచ్చారు. కాని భాజాపా మాత్రం అందుకు విరుద్దంగా తమ ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో బ‌ల‌ప‌డాల‌ని భాజాపా వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హిస్తోంది. టీడీపీలో ఉన్న ఆ కాస్త ఎమ్మెల్యేలు, ముఖ్య‌నాయ‌కుల‌ను త‌మ పార్టీలో చేర్చుకొనేందుకు పావులు క‌దుపుతోంది. ఇప్ప‌టికే కొంద‌రు నేత‌లు కాషాయం కండువా క‌ప్పుకున్నారు.

ఇద‌లా ఉంటె త్వ‌ర‌లో బాబు అరెస్ట్ అవ‌డం ఖాయ‌మ‌ని స‌మాచారం. బాబుని అరెస్ట్ చెయ్యడానికి తేరా వెనకాల ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయట. ఓటుకు నోటు సహా ఇతర అవినీతి కేసుల్లో బాబు అరెస్ట్ అవ్వచ్చని, ఔట్ లుక్ ఇండియా, ఎకనామిక్ టైమ్స్ లాంటి ప‌త్రిక‌లుకూడా క‌థ‌నాల‌ను ప్ర‌చురించింది. అదీ కాక బాబు అరెస్ట్ అవ్వ‌డం త‌థ్యం అని భాజాపా జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి , బీజేపీ ఏపీ కో ఇన్ చార్జి సునీల్ దేవధర్ ప్ర‌క‌టించారు.

గ‌తంలో బాబు, కాంగ్రెస్ క‌ల‌సి జ‌గ‌న్ మీద అక్ర‌మాస్తు కేసల విష‌యంలో జ‌గ‌న్‌ను జైలుకు పంపిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు జ‌గ‌న్ కూడా బాబును బొక్క‌లో వేసేందుకు సిద్ద‌మ‌య్యారు. బాబును నిజమైన కేసుల్లో చంద్రబాబుని జైల్లో తోసేందుకు జగన్ ఒక వైపు ప్ర‌య‌త్నాలు ప్రాంభించారు. బాబు వార‌సుడు లోకేష్ ట్విట్ట‌ర్‌లో త‌ప్ప బ‌య‌ట ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డంతో పార్టీ నేత‌లు అందురూ అభ‌ద్ర‌తా భావంతో బ‌య‌ట‌కు రావాల‌ని చూస్తున్నారు

అయితే ఏపీ సహ ఇన్ చార్జి సునీల్ దేవధర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్ లో కాకరేపుతున్నాయి. చంద్రబాబు అరెస్టుకు రంగం సిద్ధమని గ్రహించిన ’18మంది టీడీపీ ఎమ్మెల్యేలు మమ్మల్ని సంప్రదిస్తున్నారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.ఓటుకు నోటు, ఇతర అవినీతి కేసుల్లో త్వరలో చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం అంటూ జోస్యం చెప్పారాయన. సన్నిహితులు, కుటుంబసభ్యులు కూడా అవినీతిలో భాగస్వాములయ్యారని ఆరోపించారు. 18మంది టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీ చేరేందుకు సంప్రదింపులు జరిపారని వెల్లడించారు. టీడీపీ త్వరలో ఖాళీ అవడం కాయమని ప్ర‌క‌టించారు.

ఇప్పటికే టీడీపీకీ చెందిన న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు క‌షాయం గూటికి చేరి పార్టీని విలీనం చేసిన‌ సంగ‌తి తెలిసిందే. .ఇప్పుడ అదే ఊపులో ఏపీ అసెంబ్లీలోనూ టీడీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా.. పార్టీనే విలీనం చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంద‌నే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. మ‌రి బాబు ఈ సంక్షోభాన్ని ఎలా ప‌రిష్క‌రించుకుంటారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -