Thursday, May 2, 2024
- Advertisement -

మొదటి సారిగా 25 కోట్ల క్లబ్ కి చేరిన రామ్ సినిమా

- Advertisement -

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ ఎట్టకేలకు ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. రామ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. నిధి అగర్వాల్ మరియు నభ నటేష్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జులై 18న విడుదలైన మొదటి వారం లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 27.67 కోట్ల రూపాయలను వసూలు చేసింది. రామ్ కెరీర్లోనే 25 కోట్ల క్లబ్బులో చేరిన మొదటి సినిమాగా మారింది ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా.

విజయవంతంగా మొదటివారం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు తాజాగా రెండవ వారం లోకి అడుగుపెట్టింది. దీనికి తోడుగా విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’ కి పోటీగా ఈ వారం విడుదలైంది. ‘ఇస్మార్ట్ శంకర్’ రెండవ వారం కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయి అని ట్రేడ్ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ మధ్యనే చిత్ర బృందం సక్సెస్ పార్టీ చేసుకున్న సంగతి తెలిసిందే.

ఏరియా వైస్ ‘ఇస్మార్ట్ శంకర్’ మొదటి వారం కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

నిజాం: 11 కోట్లు
సీడెడ్: 4.20 కోట్లు
యూఏ: 2.98 కోట్లు
ఈస్ట్: 1.62 కోట్లు
గుంటూరు: 1.67 కోట్లు
వెస్ట్: 1.33 కోట్లు
కృష్ణ: 1.59 కోట్లు
నెల్లూరు: 0.83 కోట్లు

ఏపీ+తెలంగాణ: 25.22 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా: 1.55 కోట్లు

ఓవర్సీస్: 0.90 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా: 27.67 కోట్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -