- Advertisement -

అల్లు అర్జున్ పై జరుగుతున్న నెగిటివ్ క్యాంపెయిన్

- Advertisement -

‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన అల్లు అర్జున్ ఇప్పుడు మూడవ సారి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయబోతున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. అయితే ఈ మధ్యనే అల్లు అర్జున్ కి మరియు సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ కి మధ్య పెద్ద గొడవ జరిగిందని బన్నీ అసిస్టెంట్ డైరెక్టర్ పై గట్టిగా అరిచాడు అని పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే చిత్రబృందం ఈ విషయమై స్పందించకుండా షూటింగ్ పనులతో బిజీగా వుంది. దీంతో విసిగిపోయిన ఒక ఆంగ్ల పత్రిక రిపోర్టర్ ఈ విషయాన్ని మరింత పెద్దది చేస్తూ ఒక నెగెటివ్ ఆర్టికల్ ని పబ్లిష్ చేశారు.

మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ సినిమా లాగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా కూడా అవుతుందని అందులో పేర్కొన్నాడు. అల్లు అర్జున్ కి ఈ సినిమా పైన ఆసక్తి పూర్తిగా పోయిందని ఆ వార్త సారాంశం. నిజానికి రెండు సినిమాల మధ్య పెద్ద పొంతన అంటూ ఏమీ లేదు. అసలు సగం కూడా షూటింగ్ పూర్తవకుండానే బన్ని సినిమా పై ఆసక్తి కోల్పోయాడు అని రాయడం పై కొందరు అభిమానులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు నిజానిజాలు తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ఇలా వార్తలను ప్రచురిస్తున్నందుకు ఆ ఆంగ్ల పత్రిక పై మెగా అభిమానులు మండిపడుతున్నారు. ఏదేమైనా అల్లుఅర్జున్ తన మీద జరుగుతున్న ఈ నెగిటివ్ క్యాంపెయిన్ కి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -