Wednesday, April 24, 2024
- Advertisement -

విల‌నిజం చూపిస్తున్న క‌మెడియ‌న్‌

- Advertisement -

తెలుగు బుల్లి తెర‌పై జ‌బ‌ర్ద‌స్త్‌తో హాస్యనటుడిగా చ‌మ్మక్ చంద్ర ప‌రిచ‌య‌మ‌య్యాడు. మంచి కామెడీ టైమింగ్‌తో ఇంటిల్లిపాదిని అల‌రిస్తున్న ఈ న‌టుడు తెలుగు సినిమాల్లో కూడా న‌టించి న‌వ్విస్తున్నాడు. అయితే ఆశించిన అవ‌కాశాలు మాత్రం రాలేదు. అయితే ఇదే స‌మ‌యంలో త‌మిళం నుంచి మంచి ఆఫ‌ర్ వ‌చ్చింది. కమెడియ‌న్‌గా కాకుండా విల‌నిజం చూపించే ఓ పాత్ర వ‌చ్చింది. దీంతో వెంట‌నే అంగీక‌రించి న‌టించాడు. తెలుగులో పూర్తిస్థాయి పాత్ర ద‌క్క‌క‌లేదు కానీ త‌మిళ్‌లో ఆ పాత్ర ద‌క్కింది. సెయల్ అనే సినిమాలో చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో చంద్ర విలన్ రోల్‌లో కనిపించనున్నాడు. ఇటీవ‌ల విడుద‌లైన సినిమా ట్రైల‌ర్‌లో చంద్ర త‌న విల‌నిజం చూపించాడు. రవి అబ్బులు దర్శకత్వంలో వ‌స్తున్న ఈ సినిమాలో రాజన్ తేజేశ్వర్, థరుషి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. సిద‍్ధార్థ్ విపిన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సీఆర్ క్రియేషన్స్ బ్యానర్‌పై సీఆర్ రాజన్ నిర్మాణంలో ఈ సినిమా వ‌స్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -