Tuesday, May 14, 2024
- Advertisement -

కోలుకుంటున్న జబర్దస్త్ కమెడియన్

- Advertisement -

గత కొంత కాలం గా తెలుగు సినిమా పరిశ్రమ లో యువ హీరోలు యాక్సిడెంట్లు కి గురి అవుతున్నారు అని అంతా బాధ పడ్డాము. అవన్నీ మనం ఇంకా మరిచిపోకముందే జబర్దస్త్ టీవీ షో, మరియు సినిమాల తో ఫుల్ బిజీ గా గడుపుతున్న కమెడియన్ చలాకి చంటి రోడ్ ప్రమాదానికి గురి అయ్యాడు అని తెలిసి మనం అందరం షాక్ కి గురయ్యాము. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కావడం తో ఆయన గాయాల పాలయ్యి ఆస్పత్రి లో చేరారు.

రెండు రోజుల క్రితం సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం టీఎస్ 07 జీఎం 0060 వెళ్ళి ముందు వెళ్తున్న ఒక లారీ ని ఢీ కొట్టడం తో ఈ ప్రమాదం జరిగింది. అయితే వెంటనే అక్కడ ఉన్న స్థానికులు స్పందించి ఆయనని ఆసుపత్రి కి తరలించారు. ఈ ఘటన లో చంటి కి బాగానే గాయాలు అయ్యాయి. ప్రథమ చికిత్స చేసిన అనంతరం చంటి ని వెంటనే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కి తరలించారు.

హైదరాబాద్ లో ని ఒక ప్రైవేట్ హాస్పటల్ లో చేరిన చంటి కి వైద్యులు మెరుగైన వైద్యం అందించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. జబర్దస్త్ లో నటించే కొందరు కమెడియన్స్ కూడా ఆయనని కలిసి పరామర్శించారట. మరి కొద్దీ రోజులు రెస్ట్ తీసుకొని త్వరలో నే జబర్దస్త్ లో మళ్ళీ చంటి జాయిన్ అవ్వనున్నట్లు వారు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -