Saturday, May 4, 2024
- Advertisement -

అంచనాలను పెంచేస్తున్న ‘అక్షర’ టీజర్

- Advertisement -

హారర్ కామెడీ లతో మంచి పేరు తెచ్చుకున్న నందిత శ్వేత తాజాగా ‘7’ అనే సినిమాలో కనిపించింది. ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధించలేకపోయిన ఈమె ఇప్పుడు ‘అక్షర’ అనే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బి. చిన్ని కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ ను ఇవాళ లాంచ్ చేశారు. కేవలం రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్ వీడియో నటుడు అజయ్ గోష్ తనను తాను పిండి తాతాజీ గా పరిచయం చేసుకోవడం తో మొదలవుతుంది. అతనికి ముగ్గురు స్నేహితులు ‘షకలక శంకర్, మధునందన్, సత్య) ఉంటారు.

అప్పటిదాకా సాఫీగా సాగిపోతున్న వారి జీవితాలు అక్షర (నందిత శ్వేత) అనే ఒక టీచర్ ఎంట్రీ తో తారుమారవుతాయి. ఆ నలుగురు ఆమెను చంపేద్దామని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది సినిమాలో చూడాల్సిందే. టీజర్ చూస్తే ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉండబోతోందని తెలుస్తోంది. టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సినిమాలోని సస్పెన్స్ ఎలిమెంట్స్ బాగానే వర్కౌట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. అహితేజ బెల్లంకొండ, సురేష్ వర్మ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా జూలైలో విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -