ప్రముఖ ఈటీవీ ఛానెల్లో ప్రసారమయ్యే జబర్థస్త్ ప్రొగ్రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ షోకి విపరీతమైన రేటింగ్స్ వస్తుంటాయి. జబర్థస్త్ ప్రొగ్రామ్ ద్వారా చాలామంది ఆర్టిస్ట్‌లు ఇండస్ట్రీకి పరిచియం అయ్యారు. ధన ధన్ ధనరాజ్,వేణు,షకలక శంకర్ వంటివారు ఇండస్ట్రీకి పరిచియం అవ్వడమే కాకుండా హీరోలుగా కూడా చేశారు.
తాజాగా ఈ లిస్ట్‌లోకి వచ్చి చేరాడు చమ్మక్ చంద్ర. జబర్థస్త్‌లో ఎప్పటి నుంచో చేస్తున్నాడు చమ్మక్ చంద్ర. అతను చేసే ఫ్యామిలీ స్కీట్లకు అభిమానులతో పాటు జడ్టీలను ఫిదా అవుతుంటారు. అప్పటి వరకు ఈయన చిన్న సినిమాల్లో కేవలం అక్కడక్కడా కామెడి చేస్తూ కనిపించిన చమ్మక్ చంద్ర ,ఇప్పుడు పూర్తి స్థాయి హీరోగా చేస్తున్నాడు. రామసక్కనోళ్లు అనే సినిమాతో లీడ్ హీరోగా మారిపోతున్నాడు చంద్ర. సతీష్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రాజ్ కార్తికేన్ తెరకెక్కిస్తున్నాడు.
తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇప్పటి వరకు చిన్నితెరపైనే నవ్వులు పూయించిన చమ్మక్ చంద్ర ఇప్పుడు వెండితెర నవ్వులు పూయించడానికి రెడీ అవుతున్నాడు.మరి ఈ సినిమాకు చమ్మక్ చంద్రకు ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ