Friday, March 29, 2024
- Advertisement -

మోడీ పర్వతం.. అయిన ఢీ కొట్టేందుకు మేము సిద్దం !

- Advertisement -

ప్రస్తుతం దేశంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ ను గద్దె దించేందుకు బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం అయ్యేందుకు సిద్దమయ్యాయి. ఎందుకంటే మోడీని ఢీ కొట్టి పడగొట్టడం అంతా ఈజీ కాదు.. దేశ వ్యాప్తంగా మోడీ మ్యానియా ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. కేవలం మోడీ పేరుతోనే బీజేపీ ప్రభంజనం కొనసాగుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి అలాంటి మోడీని గద్దె దించాలంటే ప్రతిపక్షాలు ఒంటరి పోరు చేస్తే ఫలితం శూన్యం. ఎందుకంటే మోడీని సమానంగా ఢీ కొట్టే సమర్థవంతమైన నేత ప్రతిపక్ష పార్టీలలో ఒక్కరూ కూడ లేకపోవడమే అందుకు కారణం. బీజేపీ కూడా ఇదే విషయాన్ని చాలా సందర్భాలలో నొక్కి చెబుతోంది. ఇటు వైపు మోడీ.. అటు వైపు ఎవరు ? అనే ప్రశ్నను సంధిస్తోంది. .

దీనికి ప్రతిపక్షాల వద్ద ఎలాంటి సమాధానం లేదు. దాంతో ఆ లోటు ను భర్తీ చేసుకోవాలంటే.. ఒంటరి పోరు కన్నా కలిసి పోరాడడమే అనే భావనకు ప్రతిపక్షాలు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ప్రతిపక్షాలన్నీ ఏకం అయ్యి మోడీకి చెక్ పెట్టేందుకు సిద్దం అయినట్లు జాతీయ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈ మద్యకాలంలో జరుగుతున్నా పరిణామాలను గమనిస్తే 2024 ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పడే అవకాశాలు బలంగానే కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం తహతహలాడుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఇటీవల రాజీవ్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ద్వారా విపక్షాలు ఏక తాటిపైకి రావడం గ్యారెంటీ అని భావిస్తోంది. ఇక ఈ మద్య కాలంలో జాతీయ రాజకీయాల్లో బాగా హైలెట్ అవుతోన్న కే‌సి‌ఆర్.. ముక్త్ భారత్ అంటూ బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే పనిలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇక బీజేపీపై నిప్పులు చెరిగే మమతా బెనర్జీ కూడా ఇటీవల చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గనిలుస్తున్నాయి. వచ్చే 2024 ఎన్నికల్లో నితీశ్ కుమార్, హేమంత్ సొరేన్ వంటి వారితో కలవబోతున్నట్లు స్పష్టం చేశారు.

నితీశ్ కుమార్ కూడా ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తరువాత బీజేపీ వ్యతిరేక శక్తిగా ఏర్పడేందుకు అన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బిజెపియేతర పార్టీల కూటమికి మద్దతు పలికేందుకు శరత్ పవార్ కూడా సిద్దంగానే ఉన్నారు. అయితే ప్రస్తుతం డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజృవాల్ మాత్రమే బీజేపీపై ఒంటరి పోరు చేస్తున్నారు. కానీ ఎన్నికల నాటికి కేజృవాల్ కూడా బీజేపీ వ్యతిరేక కూటమిలో భాగమైన ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. మరి మోడీని గద్దె దించేందుకు.. రాహుల్ గాంధీ, కే‌సి‌ఆర్, మమతా బెనర్జీ, కేజృవాల్, నితిశ్ కుమార్, శరత్ పవార్ వంటి బలమైన నేతలు ఒకవేళ కూటమిగా ఏర్పడితే.. వీరిలో మోడీని ఢీకొట్టే అసలైన నాయకుడిగా ఎవరు నిలబడతారనేది అందరి నోళ్లలో ననుతున్న ఆసక్తికరమైన ప్రశ్న.. ఏది ఏమైనప్పటికి తాజా పరిణామాలు చూస్తుంటే.. మోడీని ఢీ కొట్టి నిలబడడం అంతా ఈజీ కాదు భావనకు విపక్షాలు వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

Also Read

మూడు రాజధానులు పక్కా.. తదుపరి వ్యూహం ఏంటి ?

కాంగ్రెస్ దూకుడు.. మామూలుగా లేదుగా !

జాతీయ పార్టీకి రంగం సిద్దం.. ప్రకటనే తరువాయి ?

Watchతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు LIVE

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -