Thursday, May 2, 2024
- Advertisement -

గెటప్ శ్రీను ఫ్యామిలీ గురించి షాకింగ్ నిజాలు..!

- Advertisement -

జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇప్పటికే జబర్దస్త్ షో టాప్ రేటింగ్ తో దూసుకెళ్తోంది. ఈ షోలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కిట్స్ చేయడం వల్ల ఈ షోని కొట్టే షో ఇంకా రాలేదని చెప్పవచ్చు. ఇక ఎక్స్‌ట్రా జబర్దస్త్ లో ముఖ్యమైన టీం సుధీర్ టీం. సుధీర్ టీంలో రాం ప్రసాద్, గెటప్ శ్రీను ముఖ్యంగా ఉంటారు. ఇక గెటప్ శ్రీను తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు.

గత 7 సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతున్న జబర్దస్త్ ప్రోగ్రాం లో మంచి పేరు ఉన్న కమెడియన్ గా గెటప్ శ్రీను పేరు సంపాధించుకున్నాడు. స్కిట్స్ లో వివిధ రకాల గెటప్స్ వేసి ఆ గెటప్ అనే పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు. జబర్దస్త్ లో అతను వేయని గెటప్ లేదంటే అందులో ఆశ్చర్యం లేదు. బుల్లితెర కమల్ హాసన్ గా కూడా పేరు తెచ్చుకున్నారు శ్రీను. బుల్లితెర పై తన సత్తా చాటుతున్న శ్రీను ఇప్పుడిప్పుడే వెండితెర మీద కూడా కనిపిస్తాడు. గెటప్ శ్రీను భార్య పేరు సుజాత.

వీరికి ఒక కొడుకు ఉన్నాడు. సుధీర్ ద్వారా పరిచయమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు శ్రీను. శ్రీను భార్య సుజాత కూడా ఆన్లైన్లో క్లాతింగ్ బిజినేస్ చేస్తోంది. ఇక నాగబాబుకు ఎంతో ఇష్టమైన కమెడియన్ గెటప్ శ్రీను. శ్రీనును చిరంజీవికి పరిచయం చేసింది కూడా నాగబాబు గారే. చిరంజీవి కూడా శ్రీను యాక్టింగ్ కు మెచ్చుకుని ఖైదీ సినిమాలో అవకాశం కూడా ఇచ్చారు. శ్రీనుకి జబర్దస్త్ లో టీం లీడర్ గా ఆఫర్ వచ్చినప్పటికి.. సుధీర్ టీంలోనే కొనసాగుతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -