Thursday, April 25, 2024
- Advertisement -

నన్ను చంపలని కత్తులు తెచ్చారు : జబర్దస్త్ నవీన్

- Advertisement -

జబర్దస్త్ ద్వారా నటుడు నవీన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. జబర్దస్త్ చేస్తూనే సినిమాల్లో నటిస్తున్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. గతంలో నేను జాబ్ చేస్తోన్న టైంలో కొందరు చంపాలని చుశారు. వెంకటేశ్ అనే ఓ వ్యక్తి నాకు మంచి ఫ్రెండ్. అతడి ఫ్రెండ్ ఒకరు నాకు స్నేహితుడయ్యాడు. ఆ తర్వాత అతడి ఫ్రెండ్‌ మల్లేశ్ అనే ఇంకొకరు నాకు ఫ్రెండ్ అయ్యాడు. మల్లేశ్ మంచోడేనని అనుకున్నాను.

అతడితో మాట్లాడుతున్న సమయంలో తెలిసిన వారు ఒకరు నా వద్దకు వచ్చారు. తన బండిని తాకట్టు పెట్టించి డబ్బులు ఇప్పించాలని కోరాడు. మల్లేశ్ అందుకు సాయం చేస్తానని అన్నాడు. మా ఇద్దరిని ఒకరి వద్దకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి తాను మళ్లీ వస్తానని చెప్పి మల్లేశ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే, తాకట్టు కొట్టు యజమాని వద్ద మల్లేశ్ డబ్బులు తీసుకుని వెళ్లిపోయాడని తెలుసుకుని షాక్ అయ్యాం. అతడికి ఎందుకు ఇచ్చావని అడిగాం. రూ.12 వేలు తీసుకెళ్లాడని ఆయన చెప్పాడు. దీంతో నేను ఆ డబ్బును ఆ వాహన యజమానికి ఇవ్వాల్సి వచ్చింది’ అని తెలిపాడు.

’ఆ తర్వాత వెంకటేశ్ తో కలిసి మల్లేశ్ ఇంటికి వెళ్లి నిలదీశాను. దీంతో ఒకరి వద్ద అప్పు తీసుకుని నా డబ్బు నాకు ఇచ్చాడు. అయితే, మల్లేశ్‌కి వడ్డీకి డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఆరు నెలల తర్వాత నాకు ఫోన్‌ చేసి డబ్బులు తిరిగి ఇవ్వాలని, వడ్డీ కట్టాలని అడిగాడు. డబ్బులు నేనెందుకు ఇస్తానని, ఎవరు తీసుకుంటే వారే ఇవ్వాల్సి ఉంటుందని, మల్లేశ్‌నే అడగాలని చెప్పాను. అయితే, నీ పేరు చెప్పే అతడు తీసుకున్నాడు. నువ్వే మా మధ్యలో ఉన్నావు, నువ్వే ఇవ్వాలని అడిగాడు. ఒక దగ్గరికి రమ్మన్నాడు. నేను వెళ్లాను. అయితే, ఆ ప్రాంతం నుంచి నన్ను ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వెళ్లనివ్వలేదు. ఓ హోటల్‌ వద్దే నిల్చోపెట్టారు. ఓ వ్యక్తి స్కూటర్‌లో కత్తులు తీసుకుని వచ్చాడు. నన్ను ఏదో చేయడానికి వచ్చారని అప్పుడు అర్థమైంది. వెంటనే నేను అక్కడి నుంచి తప్పించుకుని పోలీసుల వద్దకు వెళ్లాను. అప్పటి నుంచి నేను ఎవ్వరినీ నమ్మట్లేదు. ఈ డబ్బుల విషయంలో ఎవ్వరినీ నమ్మొద్దు’ అని నవీన్ చెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -