12 ఏళ్ల క్రింద ఇంట్లోంచి వెళ్లిపోయిన వ్యక్తిని పట్టుకున్న టిక్‌టాక్..!

- Advertisement -

12 ఏళ్ల క్రితం నాగర్‌కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి మండలం పెద్ద తండాలో రాత్లావత్‌ చంద్రునాయక్‌(46) అనే వ్యక్తి ఉండేవాడు. అయితే తనికి మతి స్థిమితం లేక ఇంట్లోంచి వెళ్లిపోయి మళ్లీ రాలేదు. అతడి కోసం భార్య, పిల్లలు 12 ఏళ్లుగా వేతుకుతూనే ఉన్నారు. అయినప్పటికి అతని జాడ దొరకలేదు. చివరికి టిక్ టాక్ వీడియో అతడ్ని తన వాళ్ల దగ్గరకు చేర్చింది.

ఇటీవల అతడి టిక్‌టాక్‌ వీడియోను చూసిన పెద్దతండాలోని ఓ వ్యక్తి ఈ విషయాన్ని చంద్రునాయక్ కుటుంబ సభ్యులకు చెప్పడంతో అతడు నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం గుడిగండ్ల గ్రామంలో ఉన్నాడని వారికి తెలిసింది. అక్కడికి వెళ్లి చంద్రునాయక్‌ను సొంత ఇంటికి తీసుకొచ్చారు. అతడు ఈ 12 ఏళ్లుగా గుడిగండ్ల గ్రామంలో చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడట. కొందరు అతడితో పనులు చేయించుకుని అన్నం పెట్టేవారని.. గడ్డం పెరిగినప్పుడు గ్రామస్థులే క్షవకం చేయించే వారని చంద్రునాయర్ కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. రాత్రి సమయాల్లో గుడి, బడి, చెట్లకింద పడుకునే వాడని ఆ గ్రామస్థులు అతడి కుటుంబానికి తెలిపారు.

- Advertisement -

ఇటీవల ఓ వ్యక్తి… చంద్రునాయక్‌ను‌ వివరాలు అడుగుతూ వీడియో రికార్డ్‌ చేశాడు. దాన్ని టిక్‌టాక్‌లో పోస్టు చేసి, అతడికి తెలిసిన వారు ఎవరైనా సంప్రదించాలని కోరడంతో ఆ వీడియో ఆ కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లింది. దీంతో వారు పోలీసుల వద్దకు వెళ్లారు. అనంతరం పోలీసుల సాయంతో చంద్రునాయక్‌ వద్దకు కుమారుడు శ్రీను, కూతురు లక్ష్మి వెళ్లి అతడిని ఇంటికి తీసుకెళ్లారు.

Most Popular

నయనతార కంటే విఘ్నేష్ చిన్నవాడా..?

లేడీ సూపర్ స్టార్ నయనతార కు ఈరోజుతో 36 ఏళ్లు. ముడుపదుల వయసు వచ్చాకా ఇండస్ట్రీలో రానించడంఅంటె అంత ఈజీ కాదు. అయితే నయనతార హీలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటు ఇప్పటికి స్టార్...

హీరోల కంటే వారి భార్యలే రిచ్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ సినిమా షూటింగ్ టైంలో హీరోయిన్ నమ్రత తో ప్రేమలో పడ్డాడు.. 2005 లో వీరి వివాహం జరిగింది. తర్వాత మహేష్ బాబు క్రేజ్ మరింత...

ఎమ్మెల్యే కొడుకులు వర్సెస్ యువనాయకుడు… ఎక్కడో తెలుసా..?

వైఎస్ జగన్ 2019 ఎన్నికల్లో సీఎం కావాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు, కోరుకోవడమే కాకుండా ఆయన్ను సీఎం చేయడానికి ఎవరి పాత్ర వారు పోషించారు. పార్టీ లో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు...

Related Articles

టిక్ టాక్ అభిమానులకు శుభవార్త!

చైనా బైట్‌డ్యాన్స్‌‌కు చెందిన టిక్‌టాక్ భారత చట్టాలకు అనుగుణంగా నడుచుకోవడం లేదని, దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, భద్రత వంటి వాటి విషయంలో ప్రమాదకరంగా మారిందంటూ జూన్‌లో దీనిపై కేంద్రం నిషేధం విధించింది....

అల్లు అర్జున్ డాన్స్ స్టెప్స్ కి పాన్ ఇండియా క్రేజ్

అల వైకుంఠపురంలో మూవీలోని 'బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టూకుంటివే జిందగికే అట్టబొమ్మై జంటకట్టూకుంటివే' అంటూ సాగే మెలోడీ సాంగ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. తమన్ తనదైన శైలిలో...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...