Friday, April 26, 2024
- Advertisement -

తెలుగులో విడుదల కాబోతున్న తమిళ్ ఫ్లాప్ సినిమా

- Advertisement -

ఈ మధ్యనే తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జ్యోతిక మరియు సీనియర్ నటి రేవతి కలిసి తమిళంలో ‘జాక్పాట్’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమాకి కళ్యాణ్ దర్శకత్వం వహించారు. టీజర్ మరియు ట్రైలర్ తోనే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఈ మధ్యనే తమిళం లో విడుదలైంది. జ్యోతిక మరియు రేవతి మాస్ లుక్స్ సినిమాకి హైలెట్ గా మారాయి. కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల నుంచి యావరేజ్ మార్కులు వేయించుకొని అంతంతమాత్రంగానే కలెక్షన్లను వసూలు చేసింది.

ఇప్పుడు అదే సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ట్రైలర్ కూడా మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసినప్పటికీ తమిళంలో ఫ్లాప్ అవడంతో ఈ సినిమాపై అంచనాలు తగ్గిపోయాయి. మరి తమిళంలో ఫ్లాప్ అయిన ఈ సినిమా తెలుగులో హిట్ అవుతుందో లేదో చూడాలి. 2 డి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య స్వయం గా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో యోగి బాబు, రాజేంద్రన్, మన్సూర్ అలీఖాన్, ఆనంద్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -