Thursday, May 2, 2024
- Advertisement -

బాలకృష్ణ-దిల్ రాజు సినిమా టైటిల్ ఇదే

- Advertisement -

ఎన్టీఆర్ బయోపిక్ తో డిజాస్టర్లు అందుకున్న నందమూరి బాలకృష్ణ కొన్నాళ్ళు సినిమాల నుంచి బ్రేక్ తీసుకొని ఇప్పుడు మళ్లీ తన ‘జై సింహా’ సినిమాకి దర్శకత్వం వహించిన కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలో సెట్స్ పైకి వెళ్ల నుంది. ఇంకా చిత్ర షూటింగ్ మొదలవలేదు కానీ బాలకృష్ణ అప్పుడే తన తదుపరి సినిమా ని దిల్ రాజు నిర్మాణంలో చేయడానికి ఒప్పుకున్నట్లు గా పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం దిల్ రాజు నిర్మాణంలో బాలకృష్ణ హీరోగా నటించనున్న సినిమాకి ఒక ఆసక్తికరమైన టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాకి ‘లాయర్ సాబ్’ అనే టైటిల్ ను అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు కానీ ప్రస్తుతం ఈ టైటిల్ మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మరోవైపు ఈ సినిమా కోసం దర్శకుడిని కూడా ఖరారు చేయాల్సి ఉంది. మరోవైపు ఈ మధ్యనే ‘మహర్షి’ సినిమాతో హిట్ అందుకున్న దిల్ రాజు ఇప్పుడు మళ్లీ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాని నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -