- Advertisement -

‘యాత్ర’లో వైఎస్ రాజారెడ్డి పాత్ర ఎవరో తెలుసా?

- Advertisement -

తెలుగు ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం రాజకీయ నేతల బ‌యోపిక్‌ హ‌వ న‌డుస్తుంది. ఆంధ్ర‌ప్రదేశ్ మాజీ దివంగత ముఖ్య‌మంత్రులు ఎన్టీఆర్‌, వైఎస్ఆర్ జీవిత క‌థ‌ల‌ను సినిమాగా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ సినిమాకు యాత్ర అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. వైఎస్ఆర్ పాత్ర‌లో మలయాళ లెజెండరీ యాక్టర్ మ‌ళ‌యాళ న‌టుడు మ‌మ్ముట్టి న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌ లుక్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ‘యాత్ర’లో రావు రమేష్.. పోసాని కృష్ణమురళి.. అనసూయ లాంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జనాల్లో ఒక్కసారిగా ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. ఈ చిత్రంలో ఇతర పాత్రలకు వినిపిస్తున్న పేర్లు చూస్తే క్యూరియాసిటీ మరింత పెరుగుతోంది.

‘ఆనందో బ్రహ్మ’ లాంటి మంచి సినిమాతో దర్శకుడిగా ప్రత్యేకతను చాటుకున్న మహి.వి.రాఘవ్ ఈ చిత్రానికి దర్శకుడన్నాక జనాల్లో సీరియస్నెస్ వచ్చింది. అయితే తాజాగా క్రేజీ ఆర్టిస్టు జగపతిబాబు వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి పాత్రలో కనిపించబోతున్నాడట. ఐతే పోలికల విషయంలో జగపతిబాబు రాజారెడ్డి పాత్రకు బాగానే సూటవుతాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఆ పాత్రలో జగపతి ఎలా మెప్పిస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -